కాకినాడ జిల్లా, జగ్గంపేట, జూలై 17:జగ్గంపేట ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో అంగన్వాడీ టీచర్, ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు, యూనిఫామ్ చీరలను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంపిణీ చేశారు. ఐసీడీఎస్ సీడీపీఓ పూర్ణిమ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా జగ్గంపేట ప్రాజెక్టు పరిధిలోని పది ఆయా పోస్టులు, ఒక అంగన్వాడీ టీచర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు ఎమ్మెల్యే స్వయంగా నియామక ఉత్తర్వులు, యూనిఫామ్‌లను అందజేసి అభినందించారు.అనంతరం ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు, గర్భిణులు, బాలింతలకు అందించే సేవల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ఉద్యోగులుగా మాత్రమే కాకుండా ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేరవేయాలని సూచించారు. నిబద్ధతతో, చిత్తశుద్ధితో పనిచేసి పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయాలని పిలుపునిచ్చారు.మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని, గ్రామీణ ప్రాంతాల్లో పోషకాహారం, ఆరోగ్యం, విద్య అభివృద్ధికి మరిన్ని చర్యలు చేపడతామని ఎమ్మెల్యే తెలిపారు.ఎంపికైన పోస్టుల వివరాలు:అంగన్వాడీ టీచర్ పోస్టు – పి. నాయకంపల్లి (1).ఆయా పోస్టులు – జగ్గంపేట (4), గండేపల్లి (1), మల్లేపల్లి (1), కిర్లంపూడి మండలం వేలంక (1), పాలెం (1), ఎస్.ఆర్.పేట (1), ముక్కొల్లు (1). ఎంపికైన వారందరికీ కార్యక్రమంలో యూనిఫామ్ చీరలను కూడా పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో అడపా భరత్, ఎస్వీఎస్ అప్పలరాజు, కొత్త కొండబాబు, వీరం రెడ్డి కాశిబాబు, గండే కాశి, పీల మహేష్, ఐసీడీఎస్ సిబ్బంది, స్థానిక నాయకులు, ఎంపికైన అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
