జగ్గంపేట, జూలై 17:జాతీయ స్థాయి నీట్ (NEET) పరీక్షలో ప్రతిభ కనబర్చి వైద్య విద్యలో ఫ్రీ సీట్ సాధించిన జగ్గంపేట శ్రీరామ్ నగర్‌కు చెందిన విద్యార్థి కోసూరి తారక్ రామ్ను స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ రావులమ్మ నగర్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించి అభినందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ, తారక్ రామ్ 720 మార్కులకు గాను 555 మార్కులు సాధించి, అత్యుత్తమ పర్సంటైల్‌తో అఖిల భారత స్థాయిలో మంచి ర్యాంకు సాధించడం అభినందనీయమని అన్నారు. కష్టపడి చదివి ఈ స్థాయికి చేరుకున్న తారక్ రామ్ యువతకు ఆదర్శంగా నిలిచాడని కొనియాడారు.తారక్ రామ్ తల్లిదండ్రులు కోసూరి జ్యోతి, కోసూరి శ్రీనివాసరావు దంపతులు కాగా, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిలా మహేష్, వెంకటలక్ష్మి దంపతుల మనవడు. భవిష్యత్తులో గొప్ప వైద్యుడిగా ఎదిగి పేద ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ, జగ్గంపేట ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ డైరెక్టర్ పిలా మహేష్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులు, ప్రోత్సాహంతో తిరుమల కాలేజీలో సీటు లభించిందని, ఆ ప్రోత్సాహమే తారక్ రామ్ ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో దోహదపడిందని పేర్కొన్నారు. ఇందుకు ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కుటుంబ సభ్యులు, అభిమానులు, స్థానిక ప్రముఖులు పాల్గొని విద్యార్థి కోసూరి తారక్ రామ్‌ను అభినందించి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
