తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৮:৫৫ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ১৮, ২০২৬, ৮:০৭ এ.এম
BREAKING NEWS

వినేవాడు ఉంటే వీధిలో నుండి విమానం వెళ్ళినట్టు జగ్గంపేటలో ఒక అద్భుత దృశ్యం

కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం నుండి ఒక అద్భుతమైన దృశ్యం! శుక్రవారం సాయంత్రం NH16 జాతీయ రహదారిపై ఆకాశంలో ఎగిరే విమానం రోడ్డుపై కనిపించడంతో స్థానికులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. భారీ లారీపై Airbus A320 విమానపు ముఖభాగాన్ని తరలిస్తుండగా, ఆ దృశ్యాన్ని చూడడానికి చిన్నారులు, పెద్దలు రోడ్డు పక్కన గుమిగూడారు. అందరూ ఫోన్లు తీసి వీడియోలు తీయడం ప్రారంభించారు. "MOMENT ENTERPRISES" అని రాసి ఉన్న ఈ విమానం VT-EPC రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. దీన్ని డ్రీమ్ ప్రాజెక్ట్ కోసం తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఆకాశంలో చూసే విమానాన్ని రోడ్డుపై చూసేసరికి జగ్గంపేట ప్రజలకు ఇది ఒక మరపురాని అనుభవంగా మిగిలిపోయింది.