తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১:২৬ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ১৮, ২০২৬, ৩:৪১ পি.এম
BREAKING NEWS

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC) ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న ‘నాంది ఫౌండేషన్’ సాఫ్ట్ స్కిల్స్ శిక్షణ తరగతులు శనివారంతో ముగిశాయి.

ఎలమంచిలి స్థానిక శ్రీ గురజాడ అప్పారావు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 13 (సోమవారం) నుండి 18 (శనివారం) వరకు జరిగిన ఈ శిబిరంలో ట్రైనర్స్ హరి, చైతన్య విద్యార్థులకు ఇంటర్వ్యూ నైపుణ్యాలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, వ్యక్తిత్వ వికాసం (మోటివేషన్) వంటి పలు కీలక అంశాలపై అవగాహన కల్పించారు.ముగింపు సభలో ప్రిన్సిపల్ డాక్టర్ ప్రేమ చంద్రశేఖర్, స్కిల్ డెవలప్మెంట్ అధికారిణి డాక్టర్ పి. రోహిణి, నాన్ టెక్నికల్ ఆఫీసర్ శివ అధ్యక్షతన శిక్షణ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ధృవపత్రాలు (సర్టిఫికెట్లు) అందజేశారు. నేటి పోటీ ప్రపంచంలో సాఫ్ట్ స్కిల్స్ ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు…🙏