

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 24న పోలవరం జిల్లాలో చేపట్టనున్న పర్యటనను విజయవంతం చేయడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం ఐటిడిఎ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన పర్యటన ఏర్పాట్లపై శాఖలవారీగా సమగ్రంగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా నిరంతర విద్యుత్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని, సభా ప్రాంగణం, హెలిప్యాడ్ తదితర ప్రాంతాల్లో ప్రాపర్ ఎర్తింగ్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ఆర్ అండ్ బి శాఖ అధికారులు రహదారుల మరమ్మతులు, శుభ్రత, సూచిక బోర్డులు, డివైడర్లు తదితర పనులు పూర్తిచేయాలని సూచించారు. సభా ప్రాంగణంలో అవసరమైన బారికేడింగ్, వేదిక ఏర్పాట్లు, ప్రేక్షకుల రాకపోకలకు అనుకూలమైన మార్గాలు సిద్ధం చేయాలని తెలిపారు. హెలిప్యాడ్ వద్ద భద్రతా ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని, గుర్తింపు కార్డులు కలిగిన వారికి మాత్రమే ప్రవేశం కల్పించాలని, అక్కడ అవసరమైన వింగ్ ఫ్లాగ్స్, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రోటోకాల్‌కు అనుగుణంగా అంబులెన్స్‌లు, వైద్య బృందాలు, అత్యవసర చికిత్సా సదుపాయాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. పారిశుద్ధ్య సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ( పిజిఆర్ ఎస్) కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి, సంబంధిత సిబ్బంది ప్రత్యేక టీ-షర్టులు ధరించి ప్రజలకు స్పష్టంగా కనిపించేలా విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. అటవీ శాఖ ద్వారా స్నేక్ క్యాచర్లను అందుబాటులో ఉంచాలని, రహదారులపై అడవి జంతువులు సంచరించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే రంపచోడవరం పట్టణంలో బహిరంగ ప్రదేశాల్లో పశువులు సంచరించకుండా ఆయా యజమానులు బాధ్యత వహించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా సరస్వతి దేవి విగ్రహం, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు సమర్పిస్తారని తెలిపారు.అనంతరం తల్లులతో ముఖాముఖి కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి శ్రీ నారా లోకేష్ పాల్గొంటారని పేర్కొన్నారు. అనంతరం మెగా పేరెంట్–టీచర్స్ మీటింగ్ ( ఎంపీటీఎం)లో పాల్గొని, సెల్ఫీ స్టాండ్ను సందర్శించడం, 9వ తరగతి విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కార్యక్రమం అనంతరం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సురపాటి ప్రశాంత్ కుమార్, ముఖ్యమంత్రివర్యులు చీఫ్ సెక్యూరిటీ అధికారులు శ్రీనివాసరావు, యం. రాము,అడిషనల్ ఎస్పీ కె. శృతి, వీఆర్వో పి. అంబేద్కర్, ఆర్డిఓ కె. స్వాతి, డీఎస్పీ అస్రాఫ్ అలీ, ఆర్జీడీలు నాగమణి, శేఖర్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ రుక్మండయ్యా, సబ్ డి ఎఫ్ ఓ అనుష, డీఈవో శ్రీరామ్ మూర్తి, డి ఎం అండ్ హెచ్ ఓ డాక్టర్ పి సరిత, డి ఆర్ డి ఎ పి డి డాక్టర్ దాసరి రత్నాకర్ రావు, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి దేవదానం, పీహెచ్ఓ నరేంద్ర కుమార్, డి సి హెచ్ ఓ సాంబశివరావు, ఎక్సైజ్ అసిస్టెంట్ సూపర్డెంట్ సుబ్రమణ్యం, తాసిల్దార్ సిహెచ్ బాలాజీ, ఎంపీడీవో ప్రసాద్, డిటిఓ రాజేష్ కుమార్, ఆర్టీసీ డిఎం మార్కెట్, జిల్లా సివిల్ సప్లై అధికారి విజయ భాస్కర్, దోమ పిడి రాంప్రసాద్, సివిల్ సప్లై డిఎం గణేష్ కుమార్, ఏపిడి శ్రీనివాస్ విశ్వనాథ్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ అహ్మద్ షరీఫ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు ఐ శ్రీనివాసరావు, అచ్యుతరావు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.