అనకాపల్లి జిల్లా గొలుగొండ
మండలంలో మేజర్ పంచాయతీ ఏ ఎల్ పురం గ్రామంలో
స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కొరమండల్ ఫెర్టిలైజర్స్ వారి సౌజన్యంతో రూ. 4.50 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్‌ఓ వాటర్ ప్లాంట్‌ను గురువారం ఉదయం 11:30 గంటలకు ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా వక్తలు ప్రసంగిస్తూ విద్యార్థులకు పరిశుభ్రమైన తాగునీరు ఎంతో అవసరమని తెలిపారు. రోజువారీ జీవితంలో స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను, విద్యార్థుల ఆరోగ్య రక్షణలో శుద్ధి చేసిన నీటి యొక్క ప్రాముఖ్యతను సభలో వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయుడు కృష్ణ ప్రసాద్, ఎస్ఎంసి చైర్మన్ లగుడు రాజులనాయుడు, గ్రోమోర్ రిజిస్టర్ మేనేజర్ కిషోర్ వర్మ, హెచ్ ఆర్ మేనేజర్వంశీకృష్ణ, రీజనల్ కంట్రోలర్ వి.హరిప్రసాద్, పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు, పాల్గొన్నారు
