తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ১:০৬ এ.এম ప్రచురణ తేదీ: জুলাই ২৫, ২০২৬, ১:০৭ এ.এম
BREAKING NEWS

*పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పదవతరగతి పూర్వ విద్యార్థులు*

*పలువురికి ఆదర్శంగా నిలుస్తున్న పదవతరగతి పూర్వ విద్యార్థులు*

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి :
మండల కేంద్రం లో ప్రభుత్వ పాఠశాలలో 1995/96 సంవత్సరం విద్యను అభ్యసించిన పదవతరగతి పూర్వ విద్యార్థులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ పలువురికి ఆదర్శం గా నిలుస్తున్నారు.సాధారణంగా పూర్వ విద్యార్థులు ఒక దగ్గర కలుసుకుని ఒకరినొకరు పలకరించుకుని యోగ క్షేమాలు తెలుసుకుని వెళ్లిపోవడం చూస్తాం.దానికి భిన్నంగా 1995/96 సంవత్సరం పదవతరగతి విద్యార్థులు మాత్రం గెట్ టుగెదర్ ఏర్పాటు చేసుకొని తన తోటి స్నేహితులు తో అందరు కలిసి ఎవరి స్తోమత తగ్గట్టు వారు ఆర్థిక సాయం చేస్తూ కొంత నిధులు సమాకుర్చుకుని అలా పొదుపు చేసిన నిధులు తో ప్రతి సంవత్సరం మంచి కార్యక్రమాలకి ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు. దీనిలో భాగంగా గతంలో వారితో కలిసి చదువుకున్న నక్కపల్లి కి చెందిన తోటి స్నేహితుడు అనారోగ్యం తో మరణిస్తే వారి కుటుంబ సభ్యులకు అండగా నిలిచి దైర్యం చెప్తూ ఆర్థిక సహాయం చేశారు.అలాగే ఈ ఏడాది కూడా శుక్రవారం మెగా పేరెంట్స్ సమావేశo కార్యక్రమం లో పాల్గొని జిల్లా పరిషత్ బాలికొన్నత పాఠశాల కు సైన్స్ ల్యాబ్ పరికరాలు కు 10,000 వేల రూపాయలు ప్రధానోపాధ్యాయురాలు శ్రీ లక్ష్మి కి అందించారు. అంతే కాకుండా జిల్లా పరిషత్ హై స్కూల్ లో సుమారుగా 20 వేల రూపాయలు నిధులు తో జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు చేయడానికి ,ఇదే పాఠశాల కు కుర్చీలు వితరణ చేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్బంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు చేస్తూన్న 95/96 పదవతరగతి పూర్వ విద్యార్థులును గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు,పలువురు అభినందించారు . ఈ కార్యక్రమం లో శ్రీపాద ప్రణవ రామ్, గొడుగులు బంగార్రాజు, గొర్స శ్రీను వాసరావు,పెదిరెడ్డి రమేష్, తోట అప్పారావు తదితరులు పాల్గొన్నారు.