తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১:৫৮ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ২৫, ২০২৬, ২:০৮ পি.এম
BREAKING NEWS

డ్రోన్ కెమెరాలతో నిఘా సిఐ రేవతమ్మ ఎస్ఐ రిషికేశవ రావు

డ్రోను కెమెరాలతో నిఘా సీఐ రేవతమ్మ గంజాయి అక్రమ రవాణాను అరికట్టడం, గంజాయి తరలింపుకు ఉపయోగించే ప్రత్యామ్నాయ మార్గాలను గుర్తించడం, అలాగే అసాంఘిక మరియు చట్టవ్యతిరేక కార్యకలాపాలపై నిఘా పెంచడం లక్ష్యంగా గొలుగొండ మరియు కృష్ణదేవిపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని భీమవరం చెక్ పోస్ట్ , అంతాడ మరియు బంగారమ్మపేట మీదుగా వచ్చే అనుసంధానమైన ప్రత్యామ్నాయ మార్గాలలో డ్రోన్ ద్వారా విస్తృతంగా పర్యవేక్షణ చేపట్టడం జరిగింది.
ఈ సందర్భంగా సిఐ రేవతమ్మ ఎస్సై రిసకేశ్వర రావు మాట్లాడుతూ డ్రోన్ సాంకేతికతను వినియోగించి దూర ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, అటవీ మార్గాలు మరియు వాహనాల రాకపోకలు తక్కువగా ఉండే ప్రాంతాలను ప్రత్యేకంగా పరిశీలించారు. గంజాయి సాగు, నిల్వ, రవాణా లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించిన ఎటువంటి సమాచారం లభించినా వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు