తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১:৫৭ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ২৮, ২০২৬, ৮:৫৭ এ.এম
BREAKING NEWS

మున్సిపల్ నాన్ పిహెచ్సి వర్కర్ల అందరికీ తల్లికి వందన అమలు చేయాలి AITUC

మున్సిపాలిటీలో పనిచేస్తున్న నాన్ పిహెచ్సి ఔట్సోర్సింగ్ వర్కర్లకు అందరికీ తల్లికి వందనం అమలు చేయాలని జిల్లా మున్సిపల్ వర్కర్స్ యూనియన్(aituc) ప్రధాన కార్యదర్శి గని శెట్టి ఏసుదాసు డిమాండ్ చేశారు ఈ సందర్భంగా సోమవారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద కార్మికులతో నిరసన తెలియజేసి అన అనంతరం ఎలమంచిలి మున్సిపల్ కమిషనర్ బి వి ఎస్ ఎన్ ప్రసాద్ రాజు గారికి వినతి పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా యేసుదాసు మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో వాటర్. ఇంజనీరింగ్.. ఎలక్ట్రికల్, కంప్యూటర్ ఆపరేటర్స్ బిల్ కలెక్టర్స్, తదితర నాన్ పిహెచ్సి, ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా తల్లికి వందన అమలు చేసి ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ అమలు చేయాలని కనీస వేతనం 26,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మిక సభ్యులు పి సూరిబాబు, సతీష్ కుమార్, పి ఎన్ మూర్తి, కుమారి తదితరులు పాల్గొన్నారు