తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৬:০৬ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ২৯, ২০২৬, ৩:০৯ এ.এম
BREAKING NEWS

*దస్తావేజు లేఖర్ల ఉపాధిని దెబ్బతీయవద్దు*

*దస్తావేజు లేఖర్ల ఉపాధిని దెబ్బతీయవద్దు*

నక్కపల్లి, జిల్లావాణి
దస్తావేజులేఖరుల ఉపాధిని దెబ్బతీయవొద్దని దస్తావేజు లేఖరులు కోరారు.
మండల కేంద్రం లోని సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోని దస్తావేజు లేఖరుల పెన్డౌన్ సమ్మె 9వ రోజు కొనసాగింది.
ఆర్ఎస్కే సెంటర్లపై వచ్చిన జీవో నెంబర్ 396 ను రద్దు చేయాలని నిరసన తెలియజేస్తూ దస్తావేజు లేఖరుల పెన్డౌన్ చేస్తూ నిరసన తెలిపారు పిపిపి విధానంలో రిజిస్ట్రేషన్ చేస్తే దస్తావేజు వృత్తికి భంగం ఏర్పడుతుందని దస్తావేజులేఖరుల మనుగడ పూర్తిగా మారిపోతుందని తక్షణం జీవో నెంబర్ 396 ను రద్దు రద్దు చేసి దస్తావేజు లేఖరులను ఆదుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దాతారం మురళీకృష్ణ, కార్యదర్శి బత్తుల శ్రీను, ట్రెజరర్ లోవరత్నం ,జాయింట్ సెక్రటరీ డిఎంపి కుమార్, త్రినాధ్ ,నవీన్, కూరపాటి సూర్యనారాయణ నూకరాజు,బొంతు రాజు, సాయి తేజ, శేఖర్,మదీనా, బాబ్జి, కొంగర రాంబాబు గోవిందు, చిరంజీవి, లక్ష్మీ,వరహాలు తదితరులు పాల్గొన్నారు.