తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৪:৪৯ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ৩০, ২০২৬, ৫:২৮ এ.এম
BREAKING NEWS

“రోజూ 2 కి.మీ నడుస్తున్నాను సార్… సైకిల్ ఇప్పించండి” అన్న చిన్నారి మాటకు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా, జగ్గంపేట, జూలై 30:ఒక చిన్నారి వినతి... ఒక ప్రజాప్రతినిధి వెంటనే స్పందన... మాట ఇచ్చి, 24 గంటల్లోనే నిలబెట్టుకున్న ఉదాహరణ జగ్గంపేటలో చోటుచేసుకుంది.జగ్గంపేట మండలం మల్లిసాల గ్రామంలో అదనపు తరగతుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను 10వ తరగతి విద్యార్థిని దొడ్డ సత్య కలిసి తన సమస్యను వివరించింది."సార్... నేను ప్రతిరోజూ రెండు కిలోమీటర్లు నడుచుకుంటూ పాఠశాలకు వెళ్తున్నాను. చదువుకు ఇబ్బందిగా ఉంది. నాకు ఒక సైకిల్ ఇప్పించండి" అంటూ ఆమె చేసిన వినమ్ర విజ్ఞప్తి ఎమ్మెల్యేను కదిలించింది.వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా విద్యార్థినికి సైకిల్ అందించేలా చర్యలు తీసుకున్నారు. ఇచ్చిన హామీని కేవలం 24 గంటల్లోనే అమలు చేశారు.గురువారం రావులమ్మ నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ చేతుల మీదుగా దొడ్డ సత్యకు సైకిల్ అందజేశారు.ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ, "బాగా చదువుకో... నీ కలలను నిజం చేసుకో. నీ విద్యాభ్యాసానికి ప్రభుత్వం అండగా ఉంటుంది" అంటూ విద్యార్థినిని అభినందించారు.ఒక చిన్నారి సమస్యను సైతం పెద్దగా భావించి, వెంటనే పరిష్కరించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చర్యను గ్రామస్తులు, తల్లిదండ్రులు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షులు జీను మణిబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ పైడిపాల సూరిబాబు, సొసైటీ చైర్మన్ బుర్రి సత్తిబాబు, పాండ్రంగి రాంబాబు, రేఖ బుల్లి రాజు, ముండ్రు ఎర్రబాబు, అడబాల రామాంజనేయులు, సియాధుల పెద్దకాపు, కానవరెడ్డి రామకృష్ణ, జొన్నాడ వీరబాబు తదితరులు పాల్గొన్నారు.