తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১২:০৪ পি.এম ప్రచురణ తేదీ: জুলাই ৩১, ২০২৬, ১২:২৬ পি.এম
BREAKING NEWS

*పెన్డౌన్ చేసి నిరసన తెలిపిన దస్తావేజులేఖర్లు*

*పెన్డౌన్ చేసి నిరసన తెలిపిన దస్తావేజులేఖర్లు*

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి

నక్కపల్లి సబ్ రిజిస్టర్ ఆఫీస్ పరిధిలోని తమ వృత్తిని కాపాడాలని దస్తావేజులేఖరులు ప్రభుత్వాన్ని కోరారు.
నక్కపల్లి దస్తావేజు లేకర్ల పెన్డౌన్ సమ్మె శుక్రవారం తో 12 వ రోజుకు చేరుకుంది . దస్తావేజు లేఖరులు జీవో నెంబర్ 396 రద్దు చేయాలని తమ వృత్తికి భద్రత కల్పించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా ఇదే వృత్తి మీద జీవిస్తూ మా కుటుంబాలను పోషించుకుంటున్నామని అన్నారు. ఈ ప్రభుత్వ ఆలోచనతో నష్ట పోతామని న్యాయం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో దస్తావేజులేఖరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దాతారం మురళీకృష్ణ , ఉపాధ్యక్షుడు ఎన్ వి రమణ, ట్రెజరర్ లోవరత్నం, సాయి తేజ, కూరపాటి సూర్యనారాయణ, నూకరాజు, గోవిందు, చిరంజీవి, బొంతు రాజు, లక్ష్మి, ధారబాబు, రమేష్, నవీన్, లోకేష్, అశోకు,తదితరులు పాల్గొన్నారు.