తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৭:১৫ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৩, ২০২৬, ৬:১৩ এ.এম
BREAKING NEWS

*రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టి కృషితో సత్తా చాటాలి* -వీసం రామకృష్ణ –

*రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమిష్టి కృషితో  సత్తా చాటాలి* -వీసం రామకృష్ణ –

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్కరు బాధ్యతగా సమిష్టి కృషితో పనిచేయాలని వైసిపి రాష్ట్ర కార్యదర్శి , విశాఖ దక్షిణ నియోజకవర్గం పరిశీలకులు వీసం రామకృష్ణ అన్నారు.ఈ మేరకు మండలం లోని బుచ్చిరాజు పేట లో పార్టీ ముఖ్య నాయకులు తో సోమవారం సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినాటి నుండి ఇచ్చిన హామీలు మరచి ప్రజలకు నష్టం కలిగించేలా పాలన చేస్తున్నారని వారి అసమర్ధత పాలనా విధానాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు.వైస్సార్ సిపి పై కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలని కోరారు. ఈ కార్యక్రమం లో మండల పార్టీ అధ్యక్షులు గొర్ల గోవిందరావు, నాయకులు యలమంచిలి మధు, తళ్ల భార్గవ్,గ్రామ నాయకులు పాల్గొన్నారు.