తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৫:০৩ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৩, ২০২৬, ৩:১০ পি.এম
BREAKING NEWS

జగ్గంపేట–గొల్లలగుంట ప్రధాన రహదారిపై ముమ్మర వాహన తనిఖీలు

జగ్గంపేట: జగ్గంపేట–గొల్లలగుంట ప్రధాన రహదారిపై పోలీసులు బుధవారం విస్తృత స్థాయిలో వాహన తనిఖీలు నిర్వహించారు. జగ్గంపేట ఎస్‌ ఐ రఘునందన్ రావు తన సిబ్బందితో కలిసి రోడ్డుపై వెళ్తున్న ద్విచక్ర, నాలుగు చక్రాల వాహనాలను ఆపి పత్రాలను నిశితంగా పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యగా ఈ తనిఖీలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా జగ్గంపేట ఎస్సై రఘునందన్రావు మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌సీ, బీమా, కాలుష్య ధ్రువీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. అలాగే ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించి సురక్షితంగా ప్రయాణించాలని కోరారు.తనిఖీల సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలువురు వాహనదారులకు జరిమానాలు విధించారు. ఈ తనిఖీల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.