తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১০:১৭ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৬, ২০২৬, ৩:৫৮ পি.এম
BREAKING NEWS

*కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి* –వీసంరామకృష్ణ —

*కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలి*  –వీసంరామకృష్ణ —

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అన్నిటిని అమలు చేయాలనీ వైసిపి రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం పార్టీ నాయకులు తో సమావేశం అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలనీ అలాగే నిరుద్యోగులకు నిరుద్యోగభృతి అందజేయాలనీ అలాగే డిఎస్సీ తో భారీగా మోసం జరిగిందని మంత్రి లోకేష్ దీనికి సమాధానం చెప్పాలని అన్నారు. జరిగిన మోసాలకు సిబిఐ తో విచారణ జరిపించాలని అన్నారు. ఇలా ఎన్నో అబద్దాలు,మోసాలు తో పరిపాలన కొనసాగించాలంటే చూస్తూ ఊరుకోబోమన్నారు. వీటిపై ఈ నెల 8న నక్కపల్లి లో దీక్షలు చేపట్టబోతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమం లో పలువురు నాయకులు పాల్గొన్నారు.