తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১১:১৮ এ.এম ప్రచురణ తేదీ: অগাস্ট ১২, ২০২৬, ১:১৮ এ.এম
BREAKING NEWS

రోలుగుంటలో జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులు ప్రారంభం.

రోలుగుంటలో జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులు ప్రారంభం.

అనకాపల్లి జిల్లా మండల కేంద్రమైన రోలుగుట్టలో ఐసీడీఎస్ ప్రాజెక్టు రావికమతం సీడీపీవో వి. మంగతాయారు ఆధ్వర్యంలో జ్ఞానజ్యోతి ట్రైనింగ్ రెండవ, మూడవ సంవత్సరానికి సంబంధించిన మూడు రోజుల శిక్షణ తరగతులు మంగళవారం రోలుగుంట జెడ్పీ హైస్కూల్‌లో ప్రారంభమయ్యాయి. ఈ శిక్షణ తరగతులు ఆగస్టు 11 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నారు.అంగన్‌వాడీ కార్యకర్తల్లో విద్య, నైపుణ్యాలను పెంపొందించడంతో పాటు చిన్నారుల అభ్యసన సామర్థ్యాలను మెరుగుపరిచే అంశాలపై శిక్షణలో అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సీడీపీవో వి. మంగతాయారు, ఎంఈఓ-2 జగన్న గారు హాజరై శిక్షణ కార్యక్రమాన్ని పరిశీలించారు.శిక్షణకు డీఆర్‌పీలుగా ఏ. ఆనందరావు, ఈ. సత్యనారాయణ, ఎం. పెంటారావు ఉపాధ్యాయులు వ్యవహరిస్తున్నారు. ఐసీడీఎస్ సూపర్‌వైజర్లు ఎస్‌కే గౌహరున్నిసా, ఎన్. హేమావతి పాల్గొన్నారు. రోలుగుంట మండలానికి చెందిన మొత్తం 58 మంది అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ మూడు రోజుల శిక్షణలో పాల్గొంటున్నారు.