
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని “విజన్ ఆంధ్రప్రదేశ్ – వికసిత్ భారత్ 2047” లక్ష్యంతో ప్రతి పౌరుడు దేశ నిర్మాణంలో భాగస్వామి కావాలని పొలవరం జిల్లా కలెక్టర్ కొత్తమానసు దినేష్ కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. మంగళవారం ఐ టి డి ఏ కార్యాలయ ప్రాంగణం లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. “అనే నేను – Partners in Nation Building” అనే ప్రత్యేక కార్యక్రమంపై విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ పలు కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. సామాజిక మాధ్యమాల్లో కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా జాతి నిర్మాణం లో ఆగస్టు 15.. 80 వ స్వాతంత్ర్య దినోత్సవం సమయంలో వారి అభిప్రాయాలను పంచుకోవాలని కోరడం జరిగింది. కలెక్టర్ కె దినేష్ కుమార్ మాట్లాడుతూ, స్వాతంత్ర్యం మనకు హక్కులు ఇచ్చిందని, ఇప్పుడు అభివృద్ధి కోసం బాధ్యతలను స్వీకరించే సమయం వచ్చిందన్నారు. 2047 నాటికి వికసిత్ భారత్, స్వర్ణాంధ్ర నిర్మాణంలో పోలవరం జిల్లా ముందుండాలని, ఆ మార్పు “ఎవరైనా” కాదు “అనే నేను” అనే భావనతో ప్రతి ఒక్కరి నుంచే ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని, ప్రతి ఇంటి, దుకాణం, కార్యాలయం వద్ద మువ్వన్నెల జాతీయ పతాకాన్ని గౌరవంగా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. కుటుంబంతో కలిసి తీసుకున్న సెల్ఫీలను సామాజిక మాధ్యమాల్లో పంచుకోవాలని సూచించారు. ఆగస్టు 14న ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కను నాటాలని, ఆ మొక్క ఎదగడం అంటే మన భవిష్యత్తు ఎదగడమేనని, పర్యావరణ పరిరక్షణ కూడా దేశసేవలో భాగమేనని పేర్కొన్నారు. జిల్లాలోని ప్రభుత్వ భవనాలు, ప్రధాన కూడళ్లు, బస్ స్టేషన్లు, కార్యాలయాలు మువ్వన్నెల కాంతులతో అలంకరించబడతాయని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, గ్రామ-వార్డు సిబ్బంది, విద్యాసంస్థలు, పరిశ్రమలు, క్రీడా సంస్థలు, సాంస్కృతిక బృందాలు, అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయని చెప్పారు. పోలవరం జిల్లా అభివృద్ధి, గిరిజనుల సంక్షేమం, నివారించదగిన మరణాల నివారణ, క్రీడలు మరియు పర్యాటకాభివృద్ధి, అలాగే పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు అర్హులైన ప్రతి ఒక్కరికీ పునరావాస ప్యాకేజీలు అందించి ప్రాజెక్ట్‌ను పూర్తి చేయడం తమ లక్ష్యమని కలెక్టర్ వివరించారు. చివరిగా, ప్రజలందరూ తమ వీడియోలు, ఫోటోలు పోస్టు చేసే సమయంలో #PartnersInNationBuilding #MyIndiaMyVision #IndependenceDay2026 #Collector_Polavaram హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి @APOfficialNews ను ట్యాగ్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు, వారి క్షేత్రస్థాయి సిబ్బంది, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, మహిళలు తమ స్వీయ (సెల్ఫీ) వీడియోలను రూపొందించి “అనే నేను కార్యక్రమంలో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యత, తమ గ్రామం – జిల్లా – రాష్ట్రం – దేశ అభివృద్ధిపై తమ సంకల్పాన్ని వ్యక్తపరుస్తూ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకోవాలని తెలిపారు. అధికారులకి ఆదేశాలు: ఈ కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె. దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా అన్ని శాఖల అధికారులు, వారి క్షేత్రస్థాయి సిబ్బంది, విద్యార్థులు, స్వయం సహాయక సంఘాల సభ్యులు, యువత, మహిళలు తమ స్వీయ (సెల్ఫీ) వీడియోలను రూపొందించి “అనే నేను కార్యక్రమంలో తప్పనిసరిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ బాధ్యత, తమ గ్రామం–జిల్లా–రాష్ట్రం–దేశ అభివృద్ధిపై తమ సంకల్పాన్ని వ్యక్తపరుస్తూ వీడియోలను సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా పంచుకోవాలని తెలిపారు.