
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: వర్షాలు కురవకపోవడంతో రాజవొమ్మంగి మండలం దూసరిపాము గ్రామంలో వర్షాలు కోసం వినూత్న రీతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.5 రోజుల పాటు విశేష పూజలు చేసి నీళ్లు వారపోసి వర్షాలు కురిపించాలని వాన దేవుడికి భక్తి శ్రద్ధలతో పూజించి మొక్కుబడులు చెల్లించుకున్నారు.
ఐదు గురు బాలలను తీసుకువచ్చి వారిని పంచ పాండవులుగా భావించి వారికి ప్రత్యేక పూజలు చేసి పంచభక్షపరమాన్నములు వార్చి వడ్డించి వానదేవుడికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఈక్రమంలోనే ఆదివారం నాడు ప్రత్యేక పూజలు గావించి అనంతరం అన్న సంతర్పణ ఏర్పాటు చేస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు