తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ২:১০ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ১৩, ২০২৬, ১:৪৪ এ.এম
BREAKING NEWS

జేపీ అగ్రహారం పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థులు చేయూత.

జేపీ అగ్రహారం పాఠశాల విద్యార్థులకు పూర్వ విద్యార్థులు చేయూత.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలంలోని జేపీ అగ్రహారం ప్రాథమిక పాఠశాలలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు పూర్వ విద్యార్థులు రామ్మూర్తి నాయుడు, సంతోష్, నాగ రమణలు తమ వంతు సహాయాన్ని అందించారు. విద్యార్థులందరికీ వైట్ యూనిఫాంలను స్పాన్సర్ చేసి పాఠశాల విద్యార్థుల పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.పూర్వ విద్యార్థులు అందించిన ఈ సహకారం విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పాఠశాల ఉపాధ్యాయులు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి, విద్యార్థుల సంక్షేమానికి ముందుకు వచ్చి యూనిఫాంలను అందించిన రామ్మూర్తి నాయుడు, సంతోష్, నాగ రమణలకు పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.