తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৪:২১ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ১৩, ২০২৬, ১২:১০ পি.এম
BREAKING NEWS

నర్సీపట్నం ప్రెస్ క్లబ్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక అధ్యక్షులుగా లగుడు వెంకటరమణ ప్రధాన కార్యదర్శిగా రుత్తల వెంకటరమణ

జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ (జాప్ ) నర్సీపట్నం ప్రెస్ క్లబ్, మరియు ఎలక్ట్రానిక్ మీడియా నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఐదు రోడ్ల జంక్షన్ లోని ఉమా నారాయణ ఫంక్షన్ హాల్ లో జాప్ రాష్ట్ర కార్యదర్శి యలమంచిలి వేణు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి ప్రకటించిన కార్య వర్గాన్ని సభ్యులు కరతాళధ్వనులతో ఆమోదించారు. ప్రెస్ క్లబ్ గౌరవ సలహదారుగా లంక శివకుమార్- (పెన్ పవర్ స్టాఫ్ రిపోర్టర్), గౌరవ అధ్యక్షులుగా పులిగా మురళి ( పి ఆర్ ఎం న్యూస్ ), అద్యక్షులుగా లగుడు వెంకటరమణ ( ఎల్ వి ఆర్ న్యూస్ ), ఉపాధ్యక్షులుగా రమణ (గొలుగొండ ) అనిమిరెడ్డి అప్పలనాయుడు (మాకవరపాలెం), జిల్లా వాణి రమణ - (నాతవరం), ప్రధాన కార్యదర్సిగా రుత్తల వెంకట రమణ (మాకవరపాలెం),
కార్యదర్శులుగా కూనిశెట్టి రామారావు (గొలుగొండ ) కోనేటి రంగబాబు - (కోట ఉరట్ల), కోశాధికారిగా కడిమి శెట్టి మాణిక్యాలరావు ( ఎన్ టీవీ తాతాజీ ), కార్యవర్గ సభ్యులుగా
రుత్తల తాతాజి (మాకవరపాలెం ),
లెక్కల రమేష్ (మాక వరపాలెం), ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎలక్ట్రానిక్ మీడియా గౌరవ అధ్యక్షులుగా ఎం ఏ రాజు ( టీవీ 8 ), అద్యక్షులుగా : కే . జగదీష్ ( మహా టీవీ),
ఉపాధ్యక్షులుగా పల్లా గోవిందరావు (6టీవీ),
వరహల బాబు (గొలుగొండ ), రహీమ్ ( బిగ్ టీవీ) ప్రధాన కార్యదర్శిగా బొడ్డు శివ (నాతవరం టీవీ7, మున్సిఫ్ టీవీ ),
కార్యదర్శులుగా బొడ్డు మహేశ్వరరావు ( మహేష్) (కే.టీవీ), పొట్ల రాజేష్ ( ఆర్ఎస్ 33 టీవీ - రోలుగుంట ), కార్యవర్గ సభ్యులుగా రమేష్ ( మాకవరపాలెం), సబ్బవరపు శ్రీను (77 టీవీ రోలుగుంట) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులను రాష్ట్ర కమిటీ సభ్యులు ఘనంగా సత్కరించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి కార్యవర్గం సమావేశం కావాలని, సంఘాన్ని మండలాల వారీగా మరింత బలోపేతం చేయడానికి కృషి చేయాలని ఈ సందర్భంగా నూతన కార్యవర్గం తీర్మానించింది. ఈ కార్యక్రమంలో జాప్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోసూరి రామకృష్ణ, సీనియర్ పాత్రికేయులు జక్కు నాయుడు, మాకవరపాలెం కోటిబాబు, పోలుపర్తి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0;
brp_mask:0;
brp_del_th:null;
brp_del_sen:null;
delta:null;
module: video;hw-remosaic: false;touch: (-1.0, -1.0);sceneMode: 0;cct_value: 0;AI_Scene: (-1, -1);aec_lux: 0.0;aec_lux_index: 0;albedo: ;confidence: ;motionLevel: -1;weatherinfo: null;temperature: 41;