తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১২:২৩ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ১৫, ২০২৬, ৪:৫২ পি.এম
BREAKING NEWS

ఆకలితో ఉన్న నిరుపేదలకు జగ్గంపేట క్రైస్ట్ చర్చి భోజన పంపిణీ

జగ్గంపేట, ఆగస్టు 15: కాకినాడ జిల్లా జగ్గంపేట మండల కేంద్రంలో జగ్గంపేట క్రైస్ట్ చర్చి ఆధ్వర్యంలో ఆకలితో ఉన్న నిరుపేదలు, అభాగ్యులకు భోజన పంపిణీ కార్యక్రమాన్ని సేవాభావంతో నిర్వహించారు. క్రైస్ట్ చర్చి సభ్యులు సమష్టిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి, అవసరంలో ఉన్న వారికి ఆహారాన్ని అందించారు.ఈ సందర్భంగా క్రైస్ట్ చర్చి బ్రదర్ కె. అభి మాట్లాడుతూ, ఆకలితో ఉన్న వారికి కనీసం ఒక పూట భోజనం అందించడం ఎంతో గొప్ప మానవతా సేవ అని అన్నారు. ఆకలితో ఉన్న నిరుపేదలను గుర్తించి వారికి భోజనం అందించేలా సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.కేవలం ఆహారం అందించడమే కాకుండా, ఆపదలో ఉన్నవారిని గుర్తించి వారికి మానవతా దృక్పథంతో అండగా నిలవడం తమ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. దేవుని నామస్మరణతో, ప్రార్థన పూర్వకంగా ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.సమాజంలో ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత మేరకు పేదలు, ఆకలితో ఉన్న వారికి ఒక పూట భోజనం అందించేందుకు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక పూట ఆహారం అందించడం ద్వారా వారి ఆకలిని తీర్చడమే కాకుండా, వారిలో ఆత్మవిశ్వాసం, మానవత్వంపై నమ్మకం పెంపొందించవచ్చని అన్నారు. భవిష్యత్తులో మరింత మంది నిరుపేదలకు సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని బ్రదర్ కె. అభి తెలిపారు. సేవా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు క్రైస్ట్ చర్చి ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, చర్చి సభ్యులు, సేవా కార్యక్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొని నిరుపేదలకు భోజనాన్ని అందించారు. కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తూ, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.