అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో 80వ స్వతంత్రదినోత్సవ వేడుకలు కృష్ణాదేవి పేట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ గురుమూర్తి ఫారెస్ట్ ఆఫీసుల వద్ద డిప్యూటీ రేంజర్ సత్యనారాయణ ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ ఈరోజు మన దేశ చరిత్రలోనే అత్యునత్తమమైన రోజు 1947 ఆగస్టు 15న భారతదేశ బ్రిటిష్ వారు భారీ నుండి సంకెళ్లు తెంచుకొని స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంది ఈ స్వేచ్ఛ మనకు ఊరికినే రాలేదు దీని వెనుక వేలాదిమంది త్యాగమూర్తులు పోరాటం రక్తం ప్రాణ త్యాగాలు ఉన్నాయి మహాత్మా గాంధీ అల్లూరి సీతారామరాజు భగత్ సింగ్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఝాన్సీ లక్ష్మీబాయి వంటి ఎందరో మహానుభావులు అహింస వీరత్వం మరియు నిరంతర పోరాటాల వల్లే మనకు ఈ రోజు స్వతంత్రంలో జీవించగలుగుతున్నాము అని తెలిపారు ఈ సందర్భంగా ఆ మహావీరులను స్మరించుకోవాలి స్వతంత్రం అంటే హక్కుల అనుభవించడమే కాదు బాధ్యతారహితంగా నడుచుకోవాలని తెలిపారు దేశ సరిహద్దుల్లో మంచులో ఎండలో మనల్ని కాపాడుతున్న సైనికులను మనకి కూడు పెడుతున్న రైతన్నలను గౌరవించడం మన బాధ్యత ప్రతి ఒక్కరు మన వంతుగా దేశ అభివృద్ధికి కృషి చేయాలి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి నైతిక విలువలతో జీవించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు మరియు ఫారెస్ట్ సిబ్బంది పాల్గొన్నారు

