తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৫:২৮ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ১৮, ২০২৬, ২:২১ এ.এম
BREAKING NEWS

పి జి ఆర్ ఎస్ ఫిర్యాదు పై విచారణకు డిమాండ్.

పి జి ఆర్ ఎస్ ఫిర్యాదు పై విచారణకు డిమాండ్.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం జానకిరాంపురం పిఎసిఎస్ లోని పలు అంశాలపై అధికారులకు ఫిర్యాదు చేసిన ఓ 64 ఏళ్ల వ్యక్తి, తన ఫిర్యాదులపై సమగ్ర విచారణ చేపట్టి న్యాయం చేయాలని కోరుతూ మరోసారి అధికారులను ఆశ్రయించారు. ఈ మేరకు ఆగస్టు 14న ఫిర్యాదు పత్రాన్ని సమర్పించారు.ఫిర్యాదుదారు తెలిపిన వివరాల ప్రకారం.గతంలో ఆగస్టు 6న గల నోటీసు ఆధారంగా పీజీఆర్‌ఎస్‌ పిటిషన్‌పై విచారణ నిర్వహించాలని కోరినట్లు పేర్కొన్నారు. అలాగే జూలై 13న PGRS No. ANPL202607134031 ద్వారా చేసిన ఫిర్యాదుపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.కాలువపల్లి పరిధిలోని భూములకు సంబంధించిన సర్వే నంబర్లు, భూముల వివరాలపై సమగ్రంగా పరిశీలన చేయాలని ఫిర్యాదులో కోరారు. సంబంధిత నిబంధనల ప్రకారం అంశాన్ని విచారించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని పేర్కొన్నారు.అలాగే మాజీ ఈసీఓ బివివివిఎస్ఆర్ జిఆర్ కృష్ణ కు సంబంధించిన కార్యాలయ సిబ్బంది కొందరు పనులకు సంబంధించి రసీదులు ఇవ్వకుండా రూ.100, రూ.50 చొప్పున వసూలు చేస్తున్నారనే ఆరోపణలను కూడా ఫిర్యాదులో ప్రస్తావించారు. ఈ ఆరోపణలపై అధికారులు విచారణ జరిపి నిజానిజాలను తేల్చాలని కోరారు.దీనిపై సంబంధిత అధికారులు సమగ్ర విచారణ చేపట్టి, ఫిర్యాదుదారుడికి న్యాయం చేయాలని కే సాంబమూర్తి నాయుడు జి నారాయణరావు స్థానికులు కోరుతున్నారు.