

పోలవరం జిల్లావాణీ ప్రతినిధి: ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల సంక్షేమం, అభివృద్ధి మరియు సమస్యల పరిష్కారా సాధన కొరకు ఏర్పడిన ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమం నూతన పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గ పరిధిలోని రాజవొమ్మంగి మండల స్థానిక అల్లూరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సూరిబాబు మరియు సభ్యుల ముఖ్య సారాధ్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఏపీయూడబ్ల్యూజే 70వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. తొలుత ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో యూనియన్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలవరం జిల్లా ఏపీయూడబ్ల్యూజే నాయకులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని కాకినాడకు చెందిన డాక్టర్ అగర్వాల్ కంటి వైద్యశాల, శ్రీరమా దంత వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించారు. అలాగే రెడ్ క్రాస్ సంస్థ సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాల్లో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వైద్య పరీక్షలకు వచ్చిన వారికి మధ్యాహ్న భోజన వసతి కూడా కల్పించారు. యూనియన్ సభ్యుడు నీలాద్రి సతీష్బాబు ఇటీవల అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఏపీయూడబ్ల్యూజే తరఫున రూ.10 వేల ఆర్ధిక సహాయాన్ని అందజేశారు.

అదేవిధంగా రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులకు ఉదయం రొట్టెలు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు మాట్లాడుతూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు మధ్య జర్నలిస్టులు వారధులుగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో పాత్రికేయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. అనంతరం స్థానిక ఏపీయూడబ్ల్యూజే. సభ్యులు ప్రజాప్రతినిధులు, అధికారులు, యూనియన్ నాయకులను దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించారు.

ఈకార్యక్రమంలో ఏపీఐఐసీ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు, ఎంపీపీ గోము వెంకటలక్ష్మి, ఆదివాసి రాష్ట్ర నాయకులు లోతా రామారావు, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎన్. సన్యాసినాయుడు, సబ్ ఇన్స్పెక్టర్ వెంకట్రావు, గిరిజన కో. ఆపరేటివ్ కార్పొరేషన్ రాజవొమ్మంగి మేనేజర్ బేబీరాణి, రాజవొమ్మంగి మండల అటవీ అధికారి ఉషారాణి, వైద్యాధికారిణి పావని, పోలవరం జిల్లా ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు ఎం. చంద్రశేఖర్, కార్యదర్శి సత్యనారాయణమూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు వీరబాబు, బాల నారాయణ, పరిటాల వెంకట్, రాజవోమ్మంగి మండల అల్లూరి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మరియు ఏపీయూడబ్ల్యూజే సభ్యులు అరిపాక సూరిబాబు చింతూరు, రంపచోడవరం డివిజన్లకు చెందిన ఏపీయూడబ్ల్యూజే జర్నలిస్టులు, యూనియన్ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు.