తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১১:১৮ এ.এম ప్రచురణ తేదీ: অগাস্ট ১৯, ২০২৬, ১:৩৩ এ.এম
BREAKING NEWS

ఎల్ నినో ప్రభావం పై బిఆర్ సి పాయింట్స్ పర్సన్స్ కు శిక్షణ

ఎల్ నినో ప్రభావం పై బిఆర్ సి పాయింట్స్ పర్సన్స్ కు శిక్షణ

మత్సవానిపాలెం, ఎల్‌నినో ప్రభావంతో పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రైతులకు అందించాల్సిన సూచనలపై బీఆర్‌సీ పాయింట్ పర్సన్స్‌కు రెండు రోజుల శిక్షణ కార్యక్రమం మత్సవానిపాలెం రైతు భరోసా కేంద్రంలో మంగళవారం ప్రారంభమైంది. డీపీఎం లచ్చన్న ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ శిక్షణలో రావికమతం, రోలుగుంట మండలాలకు చెందిన బీఆర్‌సీ పాయింట్ పర్సన్స్ పాల్గొన్నారు.డివిజన్ ఇన్‌చార్జి వరలక్ష్మి సమక్షంలో ప్రారంభమైన కార్యక్రమంలో శిక్షణలో నేర్చుకునే అంశాలు, క్షేత్రస్థాయిలో వాటిని రైతులకు ఎలా చేరవేయాలనే విషయాలను వివరించారు. మెగా బీఆర్‌సీ ఓనర్ లావణ్య బీఆర్‌సీ విధివిధానాలు, అందుబాటులో ఉండే ఇన్‌పుట్స్‌ను రైతులు ఎలా వినియోగించుకోవాలనే అంశాలపై అవగాహన కల్పించారు.రోలుగుంట మండలం బీఆర్‌సీ ఓనర్ బి. సాంబమూర్తి బీఆర్‌సీ రిజిస్టర్ల నిర్వహణ, నమోదు విధానం, ఇన్‌పుట్స్ నిల్వ కాలం, అవసరమైన పరిమాణంపై వివరించారు. ఎఫ్‌ఎంటీ గంగరాజు ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అనువైన పంటల ఎంపిక, పంటలకు చేపట్టాల్సిన రక్షణ చర్యలను వివరించారు.మోడల్ మేకర్ రామకృష్ణ ఏటీఎం, ఏ-గ్రేడ్ మోడళ్లను క్షేత్రస్థాయిలో అమలు చేసే విధానం, ఐదు అడుగుల వెడల్పుతో గట్లు ఏర్పాటు చేసి మొక్కలు నాటడం, తద్వారా ఆదాయం పొందే విధానాలను వివరించారు. శిక్షకులకు విత్తన గుళికల వినియోగంపై కూడా అవగాహన కల్పించారు. శిక్షణలో భాగంగా మూడు గ్రూపులుగా విభజించి చార్ట్ తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు.కార్యక్రమంలో డివిజన్ ఇన్‌చార్జి వరలక్ష్మి, బీఆర్‌సీ పాయింట్ పర్సన్స్, శిక్షకులు, మండల ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.