
పోలవరం జిల్లావాణీ ప్రతినిధి : పోలవరం జిల్లాలోని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలల్లో గోబర్ధన్ బయో గ్యాస్ ప్లాంట్లు ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టడం జరుగుతుందని పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ కార్యాలయ సమావేశపు హాల్లో అన్ని మండలాలకు సంబంధించిన ఎంపీడీవోలతో, డివిజనల్ డెవలప్మెంట్ అధికారితో,జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులతో సిబ్బందితో అన్ని ఆశ్రమ పాఠశాలలలో గోబర్దన్ బయో గ్యాస్ ప్లాంట్లు, ప్రతి గ్రామంలో ఎప్పటికప్పుడు పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించే విధంగా జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్ కుమార్ మాట్లాడుతూ పోలవరం జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో గోబర్ధన్ బయో గ్యాస్ ప్లాంట్లు 15 రోజుల్లోగా ఎక్కడెక్కడ కావలసి ఉన్నది గుర్తించి నివేదికలు సమర్పించాలని ఆయన అన్నారు. ప్రతి గ్రామంలోని ప్రజలకు ప్రతి రోజు సరఫరా చేసే త్రాగునీటి వాటర్ ట్యాంకులు ఎప్పుడెప్పుడు క్లీన్ చేయుచున్నది ఫోటోలు తీసి నివేదికలు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామంలో ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించే బాధ్యత సంబంధిత పంచాయతీ కార్యదర్శులపై ఉందని అదేవిధంగా ఎంపీడీవోలు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఆయన అన్నారు. ప్రతిరోజు పంచాయితీల పరిధిలో సేకరించిన తడి చెత్త పొడి చెత్త వేరు వేరు చేసి వర్మీ కంపోస్ట్ తయారు చేయాలని ఆయన అన్నారు. జిల్లాలో తడి చెత్త పొడి చెత్త తయారు చేసే షెడ్లు ఎన్ని ఉన్నవి మండలాల వారిగా ఆయన ఆరా తీశారు.

స్వచ్ఛ పదం ద్వారా గ్రామాలు, సమగ్ర పరిశుభ్రత మరియు వ్యర్ధాల రహిత వాతావరణాన్ని పెంపొందించా లని ఆయన అన్నారు. గ్రీన్ షాప్ ప్రోగ్రాం ద్వారా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయంగా పర్యావరణ రహిత ఉత్పత్తుల విక్రాయాన్ని ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని స్థాపించడమే ఈ గ్రీన్ షాపు యొక్క ముఖ్య లక్ష్యం అని ఆయన అన్నారు. అన్ని మండలాల్లోని స్వచ్ఛ రథం ప్రతిరోజు గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు అందుబాటులో ఉన్న యంత్రాలు మరియు వాహనాలను సమర్థవంతంగా వినియోగించాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలవరం జిల్లాలోని అన్ని పంచాయతీలలో చెత్తాచెదారం సేకరించే వాహనాలు ఎన్ని ఉన్నవి ఆరా తీసి అదేవిధంగా ఏన్ని వాహనాలు ప్రతిరోజు ఉపయోగించు చున్నది ఆయన ఆరా తీశారు .పోలవరం జిల్లాలోని అన్ని పంచాయతీలలో ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించే విధంగా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అదేవిధంగా పెండింగ్లో ఉన్న పనులన్నింటిని పూర్తి చేసి నిర్దేశత గడువులోగా లక్ష్యాలను సాధించాలని ఆయన అన్నారు. స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహణలో ఎటువంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు.

టూరిజం ప్రాంతంలోని ఎక్కడపడితే అక్కడ చెత్త చెదారం వేయకుండా ఒక్కొక్క డిపార్ట్మెంట్ను నియమించే విధంగా చర్యలు చేపట్టడం జరుగుతుందని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని ఈ ప్రాంత ప్రజల భాగస్వామ్యంతో గ్రామాలను పరిశుభ్రముగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దేందుకు సంబంధిత శాఖల సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. పారిశుధ్య కార్యక్రమాల ఏర్పాట్లు లో ఎవరికైనా సమస్యలు ఉన్నాయెడల మా దృష్టికి తీసుకురావాలని ఆయన అన్నారు. పోలవరం జిల్లాలోని అన్ని గ్రామాలలోని ప్రభుత్వ నిబంధన ప్రకారం ఇంటి పన్నులు కట్టించాలని సంబంధిత అధికారులను ఆయన ఆదేశించారు. ప్రతి గ్రామంలోని ఎక్కడికి అక్కడ పంచాయతీల ద్వారా బుస్ క్లియరెన్స్ చేయించాలని సంబంధిత అధికారుల ఆయన ఆదేశించారు. పంచాయతీకి సంబంధించిన కొన్ని పనులు వి బి జి రాంజీ ద్వారా ఏర్పాటు చేయుటకు పనులు గుర్తించాలని ఆయన అన్నారు. ఈ సమావేశంలో డి డి ఓ వెంకట్ నారాయణ, ఎంపీడీవోలు ప్రసాద్, యస్. శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వీర్రాజు, వివి శ్రీనివాసరావు, పి. ఇమ్మానుయేలు, డిప్యూటీ ఎంపీడీవోలు హరిబాబు, నర్సింగరావు, జిల్లా పంచాయతీ కార్యాలయ అధికారులు బి. పృద్ధి, సిహెచ్ తమన్న దొర, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.