
అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో కోడిపందాలపై నాతవరం పోలీసులు కొరడా ఝుళిపించారు.మండల కేంద్రం శివారులోని జీడితోటలో రహస్యంగా కోడిపందాలు నిర్వహిస్తున్న ఐదుగురిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.ఎస్సై తారకేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో పోలీసులు ఆకస్మికంగా దాడి చేయడంతో పందెం రాయుళ్లు పోలీసులకు చిక్కారు.వారి వద్ద నుంచి రూ.700 నగదుతో పాటు రెండు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.కోడిపందాల నిర్వహణకు పాల్పడుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకున్న పోలీసులు, అరెస్టు చేసిన ఐదుగురిని కోర్టుకు తరలించారు. మండలంలో కోడిపందాలు, జూదం వంటి అసాంఘిక కార్యకలాపాలకు తావులేకుండా ప్రత్యేక నిఘా కొనసాగుతుందని ఎస్సై తారకేశ్వరరావు స్పష్టం చేశారు.కోడిపందాలు నిర్వహించినా.. పాల్గొన్నా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. ప్రత్యేక డ్రైవ్‌లో నాతవరం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.