
కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి
కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దాపురం డీఎస్పీ ఏ.బి.జి. తిలక్ మార్గదర్శకత్వంలో, తుని రూరల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి. చెన్నకేశవరావు పర్యవేక్షణలో, కోటనందూరు ఎస్సై టి. రామకృష్ణ మరియు వారి సిబ్బంది నాలుగేళ్ల క్రితం నమోదైన మహిళ అదృశ్యం కేసుపై ప్రత్యేక దృష్టి సారించి, మిస్సింగ్ మహిళను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
కోటనందూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 09-08-2022 తేదీన, బంగారు పెద తాతిలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు Cr.No.135/2022 మహిళ మిస్సింగ్ కేసు నమోదు చేయబడింది. ఈ కేసులో సబ్బవరపు సీతాదేవి, భర్తగోవిందు, వయస్సు 32 సంవత్సరాలు, కులం: కొప్పుల వెలమ, రామకృష్ణాపురం గ్రామం, రౌతులపూడి మండలం అదృశ్యమైనట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరిగింది.
సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కేసుపై కోటనందూరు పోలీసులు ప్రత్యేక శ్రద్ధ చూపించి, RTGS 360° కెమెరా వ్యవస్థ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మరియు ఇతర టెక్నికల్ ఆధారాలను వినియోగించి మిస్సింగ్ మహిళ ఆచూకీని గుర్తించారు.
ఈ క్రమంలో ఈ రోజు సదరు మిస్సింగ్ మహిళను విజయవంతంగా ట్రేస్ చేసి, అవసరమైన విచారణ అనంతరం ఆమెను ఫిర్యాదుదారుడు మరియు కుటుంబ సభ్యులకు క్షేమంగా అప్పగించడం జరిగింది.
నాలుగు సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న మహిళ అదృశ్యం కేసును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా ఉపయోగించి ఛేదించిన కోటనందూరు పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.