తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ১১:৩২ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ২৬, ২০২৬, ৩:০৮ পি.এম
BREAKING NEWS

గంజాయి నిర్మూలనపై యువతకు అవగాహన కార్యక్రమం

గంజాయి నిర్మూలనపై యువతకు అవగాహన కార్యక్రమం

కోటనందూరు జిల్లా వాణి ప్రతినిధి

కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు, పెద్దాపురం డీఎస్పీ ఏ.బి.జి. తిలక్ పర్యవేక్షణలో, తుని రూరల్ సీఐ జి. చెన్నకేశవరావు సూచనలతో, కోటనందూరు ఎస్సై టి. రామకృష్ణ మరియు పోలీస్ సిబ్బంది ఆధ్వర్యంలో కోటనందూరు మండల పరిధిలో గంజాయి నిర్మూలన మరియు మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపైయువతకు అవగాహన కార్యక్రమంనిర్వహించారు.
ఈ సందర్భంగా యువతకు గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాల వినియోగం వల్ల ఆరోగ్యం, కుటుంబ జీవితం, విద్య, ఉద్యోగం మరియు భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని వివరించారు.మాదకద్రవ్యాలకు అలవాటు పడటం వల్ల నేరాలకుపాల్పడేఅవకాశాలు పెరగడంతో పాటు, చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలియజేశారు.
యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండి, మంచి లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. గంజాయి అక్రమ రవాణా, విక్రయం లేదావినియోగానికి సంబంధించిన సమాచారం తెలిసిన వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
“మాదకద్రవ్యాలకు దూరంగా ఉండండి మీ జీవితాన్ని,మీకుటుంబాన్ని,మీ భవిష్యత్తును కాపాడుకోండి” అని కోటనందూరు పోలీసులు పిలుపునిచ్చారు.