తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৫, ২০২৬, ১১:৫১ এ.এম ప్రచురణ తేదీ: ফেব্রুয়ারী ১৬, ২০২৬, ১১:২৮ এ.এম
BREAKING NEWS

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ అందజేత

పోలవరం జిల్లావాణి ప్రతినిధి: రాజవొమ్మంగి మండలం జడ్డంగి గ్రామానికి చెందిన నక్కా వెంకటరమణ తన కుమార్తె పుట్టుకతోనే వచ్చిన దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న తన కుమార్తె ఆపరేషన్ నిమిత్తం వైద్య ఖర్చుల కొరకు ముఖ్యమంత్రి సహాయనిధికి స్థానిక రంపచోడవరం నియోజకవర్గ శాసనసభ్యురాలు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్ పర్సన్ మిరియాల శిరీషదేవికి దరఖాస్తు చేసుకున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 54571 రూపాయల చెక్కును ఎమ్మెల్యే శిరీషదేవి మంజూరు చేయడంతో దరఖాస్తుదారుని తండ్రి నక్కా వెంకటరమణకు కుమార్తె శాస్త్రచికిత్స నిమిత్తంమంజూరు అయిన బ్యాంక్ చెక్ ను ఎమ్మెల్యే మిరియాల శిరీషదేవి ఆదేశాల మేరకు మాజీ సొసైటీ అధ్యక్షుడు గణజాల తాతారావు, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి వాసంశెట్టి గంగాధర్ సంయుక్త ఆధ్వర్యంలో వారి చేతులమీద చెక్ ను వెంకటరమణకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు కంటపురెడ్డి వీరబాబు తదితరులు పాల్గొన్నారు.