తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ৭:৪৯ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ২৭, ২০২৬, ১১:২৭ এ.এম
BREAKING NEWS

నాయుడు ఫ్రూట్స్ హోల్‌సేల్ షాప్ ప్రారంభించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

జగ్గంపేట, ఆగస్టు 27: జగ్గంపేట పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన నాయుడు ఫ్రూట్స్ హోల్‌సేల్ అండ్ రిటైల్ షాప్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. జగ్గంపేట–ఏలేశ్వరం ప్రధాన రహదారిలో వేబిడ్జ్ ఎదురుగా ఉన్న శ్రీ సాయి బాలాజీ షాపింగ్ కాంప్లెక్స్‌లో లావేటి నాయుడు, సత్తిబాబు బ్రదర్స్ ఈ షాప్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు జ్యోతుల నెహ్రూ నాయుడు ఫ్రూట్స్ షాప్‌ను ప్రారంభించారు. అనంతరం అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామివారి చిత్రపటాన్ని షాప్ నిర్వాహకులకు బహూకరించారు. నూతనంగా ప్రారంభించిన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, నిర్వాహకులకు మంచి లాభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందించారు.
షాప్ నిర్వాహకులు లావేటి నాయుడు, సత్తిబాబు బ్రదర్స్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూతో పాటు కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లావేటి నాయుడు మాట్లాడుతూ వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా తమ వద్ద అన్ని రకాల తాజా పండ్లు హోల్‌సేల్ మరియు రిటైల్ ధరలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. నాణ్యమైన పండ్లను సరసమైన ధరలకు అందించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. జగ్గంపేట పరిసర ప్రాంతాల ప్రజలకు, వ్యాపారులకు ఒకే చోట వివిధ రకాల పండ్లు అందుబాటులోకి రావడంతో నాయుడు ఫ్రూట్స్ షాప్ ద్వారా మరింత సౌకర్యం కలగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎస్‌వీఎస్ అప్పలరాజు, జీను మణిబాబు, మారిశెట్టి భద్రం, కొత్త కొండబాబు, పాండ్రంగి రాంబాబు, వేములకొండ జోగారావు, జగ్గంపేట ఎస్సై టీ. రఘునాథరావు తదితరులు పాల్గొన్నారు. నూతనంగా ప్రారంభమైన నాయుడు ఫ్రూట్స్ షాప్ నిర్వాహకులకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.