
కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలిపిన దక్షిణ వైయస్ఆర్సీపీ శ్రేణులు:
విశాఖ దక్షిణం జిల్లావాణి ప్రతినిధి: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి, భారతి దంపతుల పెళ్లిరోజు వేడుకలు దక్షిణ వైసిపి పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఘనంగా జరిగాయి. ముందుగా మాజీ ఎమ్మెల్యే, దక్షిణ వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ కేక్ కటింగ్ చేశారు. దంపతులకు శుభాకాంక్షలు తెలియజేసి అనంతరం మీడియాతో మాట్లాడారు. అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, పేద ప్రజల అభ్యున్నతికి, విద్య వైద్యానికి పెద్దపీట వేసిన తమ అధినేత జగన్ మోహన్ రెడ్డి, భారతమ్మ దంపతుల దాంపత్య జీవితం ఐదు కోట్ల ప్రజల ఆశీస్సులతో సంతోషంగా జీవించాలని కోరారు. శ్రీ కనకమహాలక్ష్మి, సింహాద్రి అప్పన్న ఆశీస్సులతో మళ్లీ పేద ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు. అంధకారంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రానికి మళ్లీ పండుగ రోజులు వస్తాయని, 2029 ఎన్నికల్లో , అలాగే స్థానిక ఎన్నికల్లో వైయస్సార్సీపీ సత్తా చాటుతుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వార్డ్ ప్రెసిడెంట్స్ నీలపు సర్వేశ్వర రెడ్డి, దస్మాంతుల మాణిక్యాలరావు, దొడ్డి బాపు ఆనంద్, పిన్నింట్ల రాజారెడ్డి,ముజీబ్ ఖాన్, జిల్లా మత్స్యకార ప్రెసిడెంట్ రాజు,స్టేట్ నాయాకులు పత్చిరిపిళ్లి రాము, మాజీ కార్పొరేటర్ పద్మనాభ అమ్మాజీ, పత్చిరిపిళ్లి లక్ష్మి, స్టేట్ మహిళా విభాగం సెక్రెటరీ షబీర బేగం, స్టేట్ అంగన్వాడి వింగ్ జనరల్ సెక్రెటరీ సలాది భాను,సౌత్ మహిళా ప్రెసిడెంట్ వాసుపల్లి బంగారమ్మ, సౌత్ వాలంటరీ విభాగం ప్రెసిడెంట్ కడవల నాగమణి,జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ నీలపు లక్ష్మి,వార్డ్ నాయాకులు బురల చిన్న, అంబటి అప్పలరాజు, మాడుగుల నారాయణమూర్తి, వార్డ్ మహిళా ప్రెసిడెంట్స్ చెలపల్లి జ్యోతి, రోజా, రమణి,గాలి పార్వతి,వలిశెట్టి లక్ష్మి, ఝాన్సీ, అన్నపూర్ణ నాయిర్,చుక్కా ఈశ్వరి, కోసేట్టి దేవి,మణి, మీనా, బుర్రలు అరుణా,జ్యోతి, మౌలేష్, దక్షిణ నియోజకవర్గ మహిళా నాయకులు దక్షిణ వైసీపీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.