
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం ,జనసేనా, బీజేపీ ప్రభుత్వం ఏర్పడి గ్రామాలలో మౌళిక సదుపాయాలు, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజలకు అన్ని కూడా అందిస్తున్నప్పటికి, ఇంకా పూర్తి స్థాయిలో ప్రజలకు చేరువయ్యాలనే సదుద్దేశంతో మండల కేంద్రాల్లో పలు ప్రత్యేక కార్యక్రమాల నిర్వహిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రభుత్వనికి చెందిన వివిధ శాఖల ప్రభుత్వ అధికారులలో మాత్రం నేటికి నిర్లక్ష్యథారణి తోనే విధులు నిర్వహిస్తున్న ఉండటంతో గిరిజన ప్రాంతాల్లో అనేక సమస్యలు ఇంకా తాండవిస్తూనే ఉన్నాయి. అటువంటి వాటిని గుర్తించి వాటిని పరిష్కరించేందుకు శనివారం ఉదయం రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రంలోని స్థానిక ప్రజా పరిషత్ సమావేశ కార్యాలయ ఆవరణ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ సోళ్ళ బొజ్జిరెడ్డి గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు పోలవరం జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు తాము సూరిబాబు తెలిపారు. రాజవొమ్మంగి మండల పరిధిలో ఉన్న గ్రామాలలో మౌలిక సదుపాయాలు, కనీస అవసరాలు లేకుండా ఉన్న అనేక గ్రామాలు ఉన్నాయని, వాటితో పాటు, ప్రజల తమ వ్యక్తిగత సమస్యలతో సతమతమవుతున్నటివంటి సమస్యలను కూడా ప్రజలు గ్రీవెన్స్ కార్యక్రమంలో నేరుగా హాజరై రాష్ట్ర గిరిజన కమిషన్ చైర్మన్ దృష్టికి తీసుకొని వచ్చి వాటిని పరిష్కరించుకోవాలని సూరిబాబు పిలుపునిచ్చారు.