తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: অগাস্ট ২৯, ২০২৬, ১১:৩৩ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ২৯, ২০২৬, ৯:১৩ এ.এম
BREAKING NEWS

మాకవరపాలెంలో 14 ఏళ్ల విద్యార్థులకు సాఫ్ట్బాల్ సెలక్షన్స్.

మాకవరపాలెంలో 14 ఏళ్ల విద్యార్థులకు సాఫ్ట్బాల్ సెలక్షన్స్.

అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాల ఆవరణలో ఈ నెల 30వ తేదీన 14 ఏళ్ల బాలబాలికలకు సాఫ్ట్‌బాల్ క్రీడా సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు.ఆదివారం ఉదయం 9 గంటలకు జరిగే ఈ సెలక్షన్స్‌లో అనకాపల్లి జిల్లాకు చెందిన 14 సంవత్సరాల లోపు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి, సెప్టెంబర్ 12వ తేదీ నుంచి విజయనగరం జిల్లాలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి సాఫ్ట్‌బాల్ పోటీలకు పంపనున్నట్లు ఆర్గనైజింగ్ సెక్రటరీ డి. రవి తెలిపారు.జిల్లాలోని క్రీడా ప్రతిభ కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పెద్ద సంఖ్యలో సెలక్షన్స్‌కు హాజరుకావాలని ఆయన కోరారు.