తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৫, ২০২৬, ৯:১৯ এ.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৩০, ২০২৬, ১২:৫৬ এ.এম
BREAKING NEWS

సెప్టెంబర్ 4వ తేదీన ఏపీ స్పీకర్ పుట్టినరోజు రక్త శిబిరాలు ఏర్పాటు రాజేష్ ఓ

ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడి జన్మదినాన్ని పురస్కరించుకుని సెప్టెంబరు 4న నియోజకవర్గంలో భారీ ఎత్తున ‘మెగా రక్తదాన శిబిరం’ నిర్వహిస్తున్నట్లు రాజేష్ వెల్లడించారు. నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రాంతీయ వైద్యశాలతో పాటు బొడ్డేపల్లి మార్కెట్ యార్డులో ఈ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. గత ఏడాది వెయ్యి మందికి పైగా రక్తదానం చేసి ఆపదలో ఉన్న ఎందరో ప్రాణాలను కాపాడారని, ఈ ఏడాది మరింత ఎక్కువ మంది రక్తదాతలను సమీకరించి సరికొత్త రికార్డు సృష్టించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. సమాజ సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ సన్నాహక సమావేశంలో నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, నర్సీపట్నం పట్టణంలోని 28 వార్డుల ఇన్ఛార్జిలు, విస్తృత స్థాయి కార్యకర్తలు పాల్గొన్నారు.