
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటీ చైర్పర్సన్, రంపచోడవరం నియోజవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి ఆమె భర్త నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు మఠం విజయ భాస్కర్ దంపతుల దృష్టికి రాజవొమ్మంగి మండలం గడుఒకుర్తి పంచాయతీ దోనెలపాలెంలో మంచినీటి ట్యాంక్ కు అనుసంధానమైన విద్యుత్ మోటార్ మరమ్మతులకు గురవడంతో స్థానిక గ్రామస్తులకు త్రాగునీటి కష్టాలు పడుతున్నారు.ఈ విషయం స్థానిక గడోకుర్తి గ్రామ పంచాయతీకి చెందిన తేదేపా యువ నాయకులు ముర్ల వీరబాబు, చలుమర్తి బన్ను ఇరువురు ఎమ్మెల్యే దంపతుల దృష్టికి తీసుకెల్లారు. వెంటనే స్పందించిన ఆమె, గ్రామ పంచాయితీ ప్రత్యేక అధికారితో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని ఎమ్మెల్యే శిరీష దేవి ఆదేశించారు. ఈక్రమంలో కొత్త విద్యుత్ మోటార్ సంబంధిత ఇతర సామాగ్రిని రాజమండ్రి ప్రాంతాల నుండి హుటాహుటిన రప్పించి మరమ్మతులు చేయించి, ఎమ్మెల్యే .దృష్టికి సమస్య వచ్చిన 24 గంటలు తిరగకుండా సమస్య పరిష్కరించి మంచినీటి సదుపాయాన్ని ప్రజలకు అందించారాని తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గణజాల తాతారావ్ పత్రిక ప్రకటన ద్వారా తెలిపారు. అంతేకాకుండా మరమ్మతులకు గురైన చేతి బోరును రిపేరు చేయించారు. ఇది ఇలా ఉండగా ఓవర్ హెడ్ ట్యాంకు నీరు ఎక్కించడానికి రెండు మార్గాల్లో రెండు బోర్లనుండి మోటార్స్ ఉంటే రెండూ పాడయ్యాయని దానిలో ఒక మోటార్ మాజీ

సర్పంచ్ నాలుగురోజుల క్రితం పంచాయతీ అధికార్ల అనుమతి లేకుండానే పట్టుకుపోయారని తెలుగుదేశంపార్టీ నాయకులు అన్నారు. పంచాయతీ కార్యదర్శి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ మండల విద్యాధికారి సత్యనారాయణ దొర మాట్లాడుతూ మా అనుమతి లేకుండా పంచాయతీ సొత్తు ఎవరూ తీసుకెళ్లరాదని అదే విధంగా అనుమతి లేకుండా తవ్వి పైపు పనులు చేయవద్దని మీకేమైనా సమస్యలుంటే మాకు చెబితే మేము చేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం ఎస్.టి.సెల్ ఉపాధ్యక్షుడు పీరు వీరభద్రరావు, పడాల కాటమరాజు, మండల విద్యాధికారి గడుఒకుర్తి పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణదొర, పంచాయతీ కార్యదర్శి ధర్మేంద్ర, ఇంజనీరింగ్ అసిస్టెంట్ కాకూరి దారబాబు గ్రామ యువత స్థానికులు పాల్గొన్నారు