
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన కమీషన్ చైర్మన్ సొళ్ళ బొజ్జిరెడ్డి పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గం రాజవొమ్మంగి మండల ప్రధాన కేంద్రం స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమానికి వినతులు అధిక మొత్తంలో వచ్చాయి. మొదటిగా కిర్రాబు గ్రామ పంచాయితీ సమీప ప్రాంతంలోని మడేరు వాగుపై కిర్రాబు ఆనకట్ట నిర్మించాలని డిమాండ్ చేస్తూ ఇది వరకు చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న వారిపై అప్పటి అధికారుల ఆదేశాల మేరకు గతంలో పోలీసులు తమ కేసులు పెట్టిన విషయం అందరికీ తెలిసిందేనని ఈ సందర్భంగా గిరిజన సంఘాల నేతలు వంతు బాలకృష్ణ, తాము సూరిబాబు, లొసుల రాజబాబులు చైర్మన్ కు గుర్తు చేశారు. అప్పటి నుంచి తాము కేసులతో కోర్టులు చుట్టూ తిరిగినా

నేటికీ ఆనకట్ట నిర్మాణం - జరుగలేదని వారు వాపోయారు. కుర్రాబు ఆనకట్ట ఆయా ప్రాంతాల్లో ప్రజలకు అత్యంత వసరమని ఆదివాసీ నేతలు కమిషన్ చైర్మన్ వద్ద వారి బాధను వెల్లబుచ్చుకున్నారు. అంతేకాకుండా కొండపోడు పట్టాలు ఇచ్చి సర్వే చేసి ' భూములు ఇవ్వలేదని వంతు బాలకృష్ణ చైర్మన్ కు తెలిపారు. ఏళ్ల తరబడి మండలంలోని పూర్తికాని అత్యవసర వంతెనలు, శిధిలమైన రహదారులను వెంటనే నిర్మించాలని కోరుతూ ఎస్టి కమిషన్ చైర్మన్ బోజ్జి రెడ్డికి ఏపీఐఐసీ డైరెక్టర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గొల్లపూడి పెద్దిరాజు వినతి పత్రం సమర్పించారు. రంపచోడవరం నియోజవర్గ మార్కెట్ కమిటీ చైర్మన్ లోతా లక్ష్మణరావు శరభవరంగ్రామ పంచాయితీ లోని 35 కిలోలు రేషన్ కార్డులు అవసరమని అర్జీని ఇచ్చారు. ఇదే క్రమంలో లాగరాయి ప్రభుత్వ ఆసుపత్రి చుట్టూ ప్రహరీ గోడ పూర్తి చేయాలని కోరుతూ ఎంపిపి గోము వెంకటలక్ష్మి అర్జీని ఇచ్చారు. చికిలింత గ్రామ పంచాయితీ కరుదేవపాలెం గ్రామంలో నకిలీ గిరిజన కులధ్రువపత్రాలతో కొండరెడ్డి ఉప కులంగా చలామణి అవుతూ అనర్హులు ప్రభుత్వ రాయితీలు దర్జాగా పొందుతున్నారని జిల్లా కలెక్టర్ వారి దృష్టికి రెండుసార్లు పిర్యాదులు ఇచ్చినా ఇప్పటివరకు ఎటువంటి విచారణ లేదని రెడ్డి శ్రీను, కొచ్చా భద్రయ్యలు ఎస్టీ కమీషన్ చైర్మన్ కు పిర్యాదు చేశారు. ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఉన్న తమ ద్వారా అయినా ఇప్పటికైనా విచారణ నిర్వహించి నకిలీ కొండ రెడ్డి కులమని చెప్పుకుంటున్న వారిపై చర్యలు తీసుకోవాలని అర్జీ అందజేశారు. నూతనంగా

ఏర్పడిన జాతీయ రహదారి 516 ఈ (హైవే) జంక్షన్ వద్ద ట్రాఫిక్ ఐలాండ్, ప్లడ్ లైట్లు ఏర్పాటు చేయలేదని వెంటనే వాటిపై చర్యలు తీసుకునే విధంగా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని పిర్యాదు ద్వారా కోరారు. ఈ విధంగా ఎస్టీ కమిషన్ చైర్మన్ బోజ్జి రెడ్డి నిర్వహించిన గ్రీవెన్స్ కి పలు సమస్య పరిస్కరించాలని కోరుతూ వినతులు అధిక మొత్తంలో వచ్చాయి. కార్యక్రమం అనంతరం ఎస్టి కమిషన్ చైర్మన్ సొళ్ళ బొజ్జిరెడ్డినీ రాజవొమ్మంగి భారతీ జనతాపార్టీ మండల ప్రెసిడెంట్ లొసుల రాజబాబు, జిల్లా ఉపాధ్యక్షులు తాము సూరిబాబు, వంతు బాలకృష్ణ సన్మానం చేశారు. ఇదే క్రమంలో పలువురు మండలానికి చెందినవారు చైర్మన్ కు ఘనంగా సన్మానించారు. ఈకార్యక్రమంలో స్థానిక మండల తహసీల్దార్ స్వామి, ఎంపిడిఓ లోకుల యాదగిరేశ్వరరావు మరియు మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు.