తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৫, ২০২৬, ১২:২৮ এ.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৩০, ২০২৬, ৫:৫৬ পি.এম
BREAKING NEWS

అరకువ్యాలీ గన్నెల గ్రామంలో ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొన్న: ముఖ్యమంత్రి, రంప నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన: శిరీష దేవి

అరకువ్యాలీ గన్నెల గ్రామంలో ‘సంజీవని’ కార్యక్రమంలో పాల్గొన్న: ముఖ్యమంత్రి, రంప నియోజకవర్గ పరిధిలోని పలు సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన: శిరీష దేవి

పాడేరు జిల్లావాణీ ప్రతినిథి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అరకు పార్లమెంటు పరిధిలోని అరకు నియోజకవర్గం గన్నెలగ్రామంలో 'సంజీవని' కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించేందుకు అరకువ్యాలీ వచ్చిన ఆయనకు జిల్లా ఇన్చార్జి మంత్రి గుమ్మడి సంధ్యారాణి, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు జిల్లా కలెక్టర్ టి.నిశాంతి, ఎస్పీ అమిత్ బర్ధర్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి స్వాగతం పలికారు. అరకువ్యాలీ వచ్చిన ముఖ్యమంత్రికి పోలవరం జిల్లాలోని రంపచోడవరం నియోజవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి తన పరిధిలోని చింతూరు రంపచోడవరం డివిజన్లలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొని వెళ్లి వాటి పరిష్కార మార్గాలు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రిని కలిసి మెమొరాండం అందజేశారు. వాటి పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జి సి సి చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్, తణుకు ఎమ్మెల్యే అనిమిల్లి రాధాకృష్ణ, పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయ్, ఏపీఎస్ఆర్టీసీ విజయనగరం జోన్ చైర్మన్ అరకు నియోజకవర్గ ఇన్చార్జ్ సియ్యారి దొన్ను దొర, డీసీఎంఎస్ చైర్మన్ కోటి బాలాజీ, రాష్ట్ర పర్యాటక బోర్డు చైర్మన్ కె. వెంకటరమణ, ట్రైకార్ డైరెక్టర్ బి. నాగరాజు, అరకు పార్లమెంట్ పరిశీలకురాలు మోజోరు తేజోవతి, అరకు నియోజకవర్గ పరిశీలకుడు బుద్ధ నాగ జగదీశ్వరరావు, మాజీ మంత్రి మత్స్యరాస మణికుమారి, మాజీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి (పాడేరు), బంజేవ్ (సాలూరు), పాలకొండ నాయకురాలు భూదేవి తదితరులు పాల్గొన్నారు.