తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ৮:৩৮ পি.এম ప్రచురణ తేదీ: অগাস্ট ৩১, ২০২৬, ২:৫৮ এ.এম
BREAKING NEWS

*జర్నలిస్ట్ ల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వ ఆమోదం*

*జర్నలిస్ట్ ల హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వ ఆమోదం*

మార్కాపురం :జిల్లావాణి ప్రతినిధి

రాష్ట్ర వ్యాప్తంగా వున్న అక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిందని రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కోలుసు పార్థసారథి ఏపి యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (ఏపీయూడబ్ల్యూజే ) రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు కు తెలిపారు.
ఆదివారం సాయంత్రం మంత్రి మార్కాపురం చేరుకున్న సందర్భంగా యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు ఆయనను కలిసి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ, అలాగే నివాస స్థలాలకు సంబంధించిన అంశం గురించి చర్చించారు.
అందుకు స్పందించిన మంత్రి పార్థ సారథి మాట్లాడుతూ గత రెండు రోజుల క్రితమే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ప్రభుత్వం ఆమోదం తెలపడంతో పాటు ఆర్థిక శాఖ నుండి అనుమతి లభించిందని తెలిపారు.
ఈ పథకం వలన రాష్ట్ర వ్యాప్తంగా వున్న సుమారు 20 వేల మంది అక్రిడిడేషన్ జర్నలిస్ట్ లకు ఉపయోగం జరగనుందని, అలాగే
ఈ పాలసీ వెంటనే అమలులోకి వస్తుందని ఆయన తెలిపారు.
ఈ పాలసీ పొందిన వ్యక్తి యాక్సిడెంట్ జరిగి మృతి చెందితే ఆ కుటుంబానికి రూ 10 లక్షల రూపాయల మేరకు ఆర్థిక సాయం ఇవ్వడం జరుగుతుందని, కావున ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని ఆయన జర్నలిస్ట్ లను కోరారు.
నూతనంగా ఏర్పడిన జిల్లాలో సమాచార శాఖ సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమేనని, త్వరలో భర్తీ చేయడం జరుగుతుందని అన్నారు.
2019- 24 మధ్య కాలంలో వైసిపి ప్రభుత్వం ఈ పాలసీని పట్టించుకోలేదని, దీంతో జర్నలిస్ట్ లు అనేక ఇబ్బందులు పడ్డారని ఆయన గుర్తు చేశారు.
అలాగే అర్హులైన జర్నలిస్ట్ లకు నివాస స్థలాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.ఈ మేరకు తమ యూనియన్ విజ్ఞప్తి మేరకు జర్నలిస్ట్ లకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఐవి. సుబ్బారావు మంత్రి పార్థసారధికి ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్బంగా మంత్రి పార్థ సారథిని కలసిన వారిలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు ఎన్ వి రమణ, జిల్లా సహాయ కార్యదర్శి బంకా శ్రీనివాసరావు, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ కె. బాజీవలి,
కోశాధికారి దారివేముల బాబీతో పాటు పలువురు జర్నలిస్ట్ లు ఉన్నారు.