
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బుచ్చంపేట గ్రామంలో పలు సేవా కార్యక్రమాలురోలుగుంట: జనసేన పార్టీ అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకుని బుచ్చింపేటలో పలు సేవా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించేందుకు జనసేన శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు.పార్టీ నాయకులు శ్రీ పీవీఎస్ఎన్ రాజు సారథ్యంలో, రోలుగుంట మండల వీర మహిళా అధ్యక్షురాలు చిటికెల శ్రీ నాగ దుర్గా మహేశ్వరి ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2న వేడుకలు నిర్వహించనున్నట్లు తెలిపారు.వేడుకల్లో భాగంగా ఉదయం గ్రామదేవత మరిడి మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం స్థానిక ఆసుపత్రిలో రోగులకు పాలు, పండ్ల పంపిణీ, సాయంత్రం పట్టణ ప్రాంతంలో నిరుపేదలకు అన్నదానం, కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమాలకు జనసేన కుటుంబ సభ్యులు, వీర మహిళలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.