పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్లా రంపచోడవరం నియోజవర్గం మారేడుమిల్లీ మండలంలో నిర్వహించిన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల" పంపిణీ కార్యక్రమంలో స్థానిక నియోజకవర్గ శాసన సభ్యురాలు మిరియాల శిరీష దేవి పాల్గొన్నారు.

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పెన్షన్ లబ్ధిదారులకు అందజేస్తున్న ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ లను ఎమ్మెల్యే శిరీష దేవి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యురాలు శిరీష దేవి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటుందని ఆమె అన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు సామాజిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని ప్రభుత్వం మరింత సమర్థవంతంగా అమలు చేస్తోందనీ ఆమె తెలిపారు. పింఛన్ నగదు అందుపుచ్చుకుంటున్న లబ్ధిదారుల ముఖాల్లో కనిపించిన ఆనందం, వారి కుటుంబాలకు కలిగిన భరోసా ప్రభుత్వ సంక్షేమ పాలనకు నిలువెత్తు నిదర్శనం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ప్రజల అవసరాలను గుర్తించి ప్రతి కుటుంబానికి అండగా నిలిచి సంక్షేమాన్ని ప్రతి గడపకు చేర్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ధ్యేయం అని తెలియజేశారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని శిరీష దేవి చెప్పుకొచ్చారు. .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మారేడుమిల్లి మండల అధ్యక్షులు గురుకు కుమార్, జనసేన మండల అధ్యక్షుడు మల్లా దుర్గాప్రసాద్, రాష్ట్ర నూర్ భాషా కార్పొరేషన్ డైరెక్టర్ ఫేక్ సుభాని, క్లస్టర్ ఇంచార్జ్ డాక్టర్ రాజకుమార్ రెడ్డి పల్లాల, ఐటిడిపి రంపచోడవరం నియోజకవర్గ అధ్యక్షులు పాము రాంబాబు, మండల ప్రధాన కార్యదర్శి కర్రీ సన్యాసిరెడ్డి, యూనిట్ ఇంచార్జ్ అందాల సూర్యనారాయణ రెడ్డి, మాజీ మండల అధ్యక్షులు బి శెట్టి అప్పాజీ, సుండం ప్రకాష్ రావు, కట్రం సోమరాజు, విండెల గోపి, మాజీ సర్పంచ్ వీరవల్లి జార్జి బాబు, మాజీ ఎంపీటీసీ కానెం విజయలక్ష్మి, మాదాసి తిరుపతిరావు, సుండ్రం అబ్బాయి దొర, కత్తుల బంగారు రెడ్డి, కత్తులు కర్రెడ్డి, కత్తుల శ్రీనివాసరెడ్డి, దూడ ప్రణీత్ , గొర్లే నారాయణ ఎన్‌డీఏ కూటమి మండల పార్టీల అధ్యక్షులు, నామినేటెడ్ పదవుల సభ్యులు, అనుబంధ కమిటీల సభ్యులు, ప్రజా ప్రతినిధులు, యూనిట్ & క్లస్టర్ ఇన్‌చార్జీలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.