
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: ప్రతి నెల వివిధ రకాలైన ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్లు 1వ తారీఖున లబ్ధిదారులకు అందించే విధంగా ఎక్కడికక్కడ ఏర్పాట్లు చేయడం జరిగిందని పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం రంపచోడవరం మండలం బొర్నగూడెం గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమం కలెక్టర్ కె. దినేష్ కుమార్ వివిధ రకాలైన సామాజిక పింఛన్లు లబ్ధిదారులకు


అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పోలవరం జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తారీఖున ప్రభుత్వ నిబంధన ప్రకారం వివిధ రకాలైన సామాజిక పింఛన్లు అందజేయుటకు ఎక్కడికక్కడ సిబ్బందిని ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రంపచోడవరం మండలం బోర్నగూడెం గ్రామంలోని వివిధ రకాలైన పింఛన్ లబ్ధిదారుల ఇండ్ల వద్దకు వెళ్లి కలెక్టర్ వారి చేతుల మీదుగా సామాజిక పింఛన్లు అందజేయడం జరిగింది. ప్రతినెల సకాలంలో వివిధ రకాలైన పింఛన్లు లబ్ధిదారులకు అందుచున్నది లేనిది అదేవిధంగా ప్రతినెల రేషన్ బియ్యం సకాలంలో అందుచున్నది లేనిది ఆయన ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వారు కొన్ని ఇండ్ల వద్దకు వెళ్లి బాల బాలికలకు టీకాలు వేయించినది లేనిది ఆరా తీసి బేబీని జిల్లా కలెక్టర్ ఎత్తుకోవడం జరిగింది. మా గ్రామంలోని అంగన్వాడి భవనానికి, పాఠశాలకు మరమ్మతులు చేయించాలని అదేవిధంగా మా గ్రామంలోని పూర్వ నుండి నివాసముంటున్న వారికి కొత్తగా గృహాలు మంజూరు చేయాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ వారి దృష్టికి తీసుకురాగా జిల్లా కలెక్టర్ వారు స్పందించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యలు పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. పోలవరం జిల్లాలోని ప్రతి

మండలంలోని ప్రతి గ్రామంలోని వివిధ రకాలైన ఎన్టీఆర్ సామాజిక భద్రత పింఛన్లు నిర్ణీత సమయంలోగా లబ్ధిదారులకు పింఛన్లు అందించే బాధ్యత సంబంధిత అధికారులపై ఉందని ఆయన అన్నారు. అదేవిధంగా సామాజిక పింఛన్లు అందజేయడంలో ఎవరైనా నిర్లక్ష్యం వహించిన ఎడల శాఖా పరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈకార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వారి వెంట పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ షేక్ మహమ్మద్ షరీఫ్, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ దాసరి రత్నాకర్ రావు. తాసిల్దార్ సిహెచ్ బాలాజీ, ఎంపీడీవో ప్రసాద్, ఎంపీడీవో పరిపాలన అధికారి పి.జయంతి. పి ఎ ఓ ఎల్ రాంబాబు గ్రామస్తులు, సచివాలయ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.