
పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: పోలవరం జిల్రంలా పచోడవరం నియోజవర్గం ఏటపాక మండలం గొల్లగుప్పలో 34 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. వీరిలో 32 మంది చిన్నారులు, ఇద్దరు పెద్దలు ఉన్నారు. చికిత్స పొందుతున్న వారిలో 7 ఏళ్ల మడివి జమున మృతి చెందారు.

తాను జీపీఎస్ పాఠశాలలో రెండో తరగతి చదువుతోంది. మిగిలిన 33 మంది ఆరోగ్యం నిలకడగా ఉంది. వీరిలో 31 మంది చిన్నారులు, ఇద్దరు పెద్దలు చికిత్స పొందుతున్నారు. లక్ష్మీపురం పీహెచ్‌సీలో 19

మందికి వైద్య సేవలు అందిస్తున్నారు. వీరిలో 17 మంది చిన్నారులు, ఇద్దరు పెద్దలు ఉన్నారు. అందరి ఆరోగ్యం నిలకడగా ఉంది.ముందస్తు చర్యల్లో భాగంగా లక్ష్మీపురం పీహెచ్‌సీలో ఉన్న 17 మంది చిన్నారుల్లో 13 మందిని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు అప్రమత్తమై, గ్రామంలో వైద్య సేవలను ముమ్మరం చేశారు. ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్, ఏఎస్పీ బి. హేమంత్ బండిరేవు వద్ద గ్రామస్తులతో మాట్లాడి బాధితులను ఆసుపత్రులకు తరలించారు. మంగళవారం రాత్రి భద్రాచలం ఏరియా ఆసుపత్రిని, అనంతరం లక్ష్మీపురం పీహెచ్సీ నీ సందర్శించిన ఐటీడీఏ పీవో శుభం నోఖ్వాల్ బాధితుల పరిస్థితిని స్వయంగా పర్యవేక్షించారు .ప్రస్తుతం బాధితులందరి ఆరోగ్యం స్థిరంగా ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ కె. దినేష్ కుమార్ తెలిపారు.