తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ৬:১০ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ৯:২১ এ.এম
BREAKING NEWS

*నక్కపల్లి లో దివంగత నేత రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం *

*నక్కపల్లి లో దివంగత నేత రాజశేఖరరెడ్డి వర్ధంతి కార్యక్రమం *

నక్కపల్లి, జిల్లావాణి ప్రతినిధి
దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి 17 వ వర్ధంతి కార్యక్రమం మండల కేంద్రంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి వీసం రామకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈసందర్బంగా ముందుగా వై ఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం వీసం మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి జననేత గా పేద ప్రజలకు ముఖ్య మంత్రి గా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో వేల గుండెలు ఆగిపోకుండా కాపాడిన మహోన్నత నాయకుడు అని అన్నారు. అనంతరం భారీ ఎత్తున అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమం లో మండల నలుమూలల నుండి భారీ ఎత్తున వైస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.