తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ১০:৩৪ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ২:১১ পি.এম
BREAKING NEWS

యలమంచిలి డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా బహుమతులు పంపిణీ చేసిన కర్రి ఝాన్సీ

.

డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా ఎలమంచిలి హాకీ గ్రౌండ్ లో జరిగిన హాకీ పోటీలు రసవత్తరం గా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ సీనియర్ నాయకురాలు కర్రి ఝాన్సీ, పట్టణ జనసేన పార్టీ అధ్యక్షుడు బొద్దపు శ్రీను హాజరు అయ్యి విజేతలకు బహుమతులు అందించారు. హాకీ అంటే ఎలమంచిలి అని త్వరలో టర్ఫ్ కోర్టు నిర్మాణం MLA విజయ్ కుమార్ ఆధ్వర్యం లో ఏర్పాటు అవుతుంది అని తెలిపారు. విజేత గా నిలిచిన రాంబాబు జట్టుకు క్యాష్ ప్రైజ్ ట్రోఫీ అందించారు. రన్నర్స్ గా ఆర్మీ బాయ్స్, థర్డ్ ప్లేస్ శ్రీరాములు టీం కి ప్రైజ్ లు అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ అసోసియేషన్ కన్వీనర్ కోటారు నరేష్, అసోసియేషన్ ప్రతినిధులు శెట్టి రమేష్,g రాంబాబు, సీనియర్ హాకీ ప్లేయర్ పాల్గొన్నారు