

డ్రగ్స్, గంజాయి సేవిస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు డ్రగ్ టెస్టింగ్ కిట్లు అందుబాటులో ఉన్నాయి. ఇటీవల ఎలమంచిలి టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి చేవిస్తున్నారని అనుమానం ఉన్న కొంత మందికి డ్రగ్ టెస్టులు నిర్వహించగా, వారిలో కొంతమందికి గంజాయి సేవించినట్లు టెస్ట్ రిపోర్టులో నిర్ధారణ అయింది.
వారిని అనకాపల్లి డీ-అడిక్షన్ సెంటర్‌లో చేర్పించి, వారు మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడి మంచి మార్గంలో నడిచేలా అవసరమైన సహాయం అందించడం జరిగింది.
కావున, మీ మీ ప్రాంతాల్లో ఎవరైనా డ్రగ్స్ లేదా గంజాయి సేవిస్తున్నట్లు తెలిసినా, లేదా ఎవరిపైనైనా అనుమానం ఉన్నా, వెంటనే ఎలమంచిలి టౌన్ పోలీసులకు సమాచారం అందించండి.
మీరు అందించే సమాచారం ద్వారా ఒక యువకుడిని మాదకద్రవ్యాల బారిన పడకుండా కాపాడవచ్చు. మాదకద్రవ్యాల కారణంగా యువత చెడు దారిలోకి వెళ్లకుండా, వారి భవిష్యత్తు మంచిగా ఉండేలా మనమందరం కలిసి బాధ్యతగా సహకరిద్దాం.
ఎవరైనా గంజాయి సేవిస్తున్నట్లు మీకు అనుమానం ఉంటే పోలీసులకు సమాచారం అందించండి. అవసరమైన పరీక్షలు నిర్వహించి, సేవించినట్లు నిర్ధారణ అయితే, వారికి డీ-అడిక్షన్ సెంటర్ ద్వారా చికిత్స మరియు కౌన్సెలింగ్ అందించి మంచి మార్గంలోకి తీసుకురావడానికి మన వంతు సహాయం చేద్దాం.
మాదకద్రవ్య రహిత ఎలమంచిలి కోసం మనమందరం కలిసి పనిచేద్దాం. హాయ్ బ్రో ప్రజలందరూ సహకరించాలని
ఎలమంచిలి టౌన్ పోలీస్ వారు కోరారు