తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ১১:৩২ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ৩:৫৩ পি.এম
BREAKING NEWS

పేద ప్రజల హృదయాలలో నిలిచిన వైయస్సార్.

పేద ప్రజల హృదయాలలో నిలిచిన వైయస్సార్.

కోటనందూరు జిల్లా వాణి
ప్రతినిధి

పేద ప్రజల హృదయాలలో నిలిచిన మహోన్నత వ్యక్తి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని వైఎస్ఆర్సిపి నాయకుడు కొరుప్రోలు కృష్ణ అన్నారు. కాకినాడ జిల్లా కోటనందూరులో వైయస్ రాజశేఖర్ రెడ్డి 17వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి మనకు దూరమై 17 సంవత్సరంలు అయినప్పటికీ ప్రతి పేదవాడు గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని ఆయన చేసిన సేవలు మరువలేనివి అని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్,ఉచిత విద్యుత్, జలయజ్ఞం, 108, రైతు రుణమాఫీ పథకాలను అన్ని వర్గాల ప్రజలకు చేరు చేశారని అన్నారు. ఆయన ఆశయాలు ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల పాలనలో ముందుకు తీసుకెళ్లారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వత్సవాయి నారాయణ మూర్తి రాజు, చింతల వెంకటరమణ, తోలెం విజయరాజు, ముక్కుడుపల్లి బాబురావు, చిటికెల వెంకటరమణ, ఉల్లూరి శ్రీను, మామిడి కృష్ణ, తోలెం అప్పారావు, గూటాల సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు.