తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৩, ২০২৬, ১২:৩১ এ.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ২, ২০২৬, ৪:১৩ পি.এম
BREAKING NEWS

కుశర్లపూడిలో ఘనంగా వైయస్సార్ 17వ వర్ధంతి వేడుకలు.

కుశర్లపూడిలో ఘనంగా వైయస్సార్ 17వ వర్ధంతి వేడుకలు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడి గ్రామంలో వైఎస్సార్‌సీపీ పార్టీ సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి, పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, పేదలు మరియు బలహీన వర్గాల కోసం చేపట్టిన పలు కార్యక్రమాలను నాయకులు, కార్యకర్తలు ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ ప్రజా సేవలో ముందుకు సాగాలని ప్రతిజ్ఞ చేశారు.కుసర్లపూడి గ్రామ సర్పంచ్ మడ్డు అప్పలనాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం వైఎస్సార్‌కు ఘన నివాళులు అర్పించారు.