
అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలం తామరంలో వీధి దీపాలు లేక ప్రజలు రాత్రి సమయంలో భయాందోళన చెందుతున్నారు. ప్రజలు ఆరు నెలల నుండి అధికారులకు గ్రామ కార్యదర్శి కు విన్నవించుకున్న పట్టించుకున్న దాఖలాలు లేవని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కార్యదర్శికి ఎంపీడీవో కార్యాలయంలో ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన స్పందన కరువైందని విమర్శిస్తున్నారు. రాత్రి సమయంలో పిల్లలతో బయటికి రావాలంటేనే కుక్కల బెడద ఎక్కువ అవడంతో భయాందోళనకు గురవుతున్నామన్నారు. ఈ విషయంపై ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీధి దీపాలు వేయాలని కోరుతున్నారు.