తెలుగు న్యూస్ ప్రింట్ ప్రజల స్వరం • నిజమైన వార్తలు
ప్రింట్ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ৮:২৭ পি.এম ప్రచురణ తేదీ: সেপ্টেম্বর ৪, ২০২৬, ১২:২১ পি.এম
BREAKING NEWS

అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భూమిపూజ

అభివృద్ధి పనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి భూమిపూజ

పోలవరం జిల్లావాణీ ప్రతినిథి: రహదారుల సౌకర్యాలను విస్తరించడమే ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గిరిజన సంక్షేమ కమిటి చైర్పర్సన్, రంపచోడవరం నియోజకవర్గం ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి అన్నారు. నియోజకవర్గ పరిధిలోని అడ్డతీగల మండలంలో గురువారం ఉదయం ఎమ్మెల్యే శిరీష దేవి నూతనంగా నిర్మించనున్న పీఎం- జన్ మన్ నిధులు ద్వారా మంజూరు అయిన పిఐయు శాఖ పర్యవేక్షణలో చేపట్టబోయే మట్లపాడు గ్రామం నుండి బడదాం గ్రామం వరకు 5.5 కిలోమీటర్ల మేర రూ; 3.27 కోట్ల వ్యయంతో చేపట్టే నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అలాగే మట్లపాడు నుండి ఉప్పలపాడు గ్రామం వరకు 3.1 కిలోమీటర్ల మేర రూ;2.64 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు పనులకు భూమిపూజ చేశారు. మరియు డి.భీమవరం నుండి నూకరాయి గ్రామం వరకు 3.8 కిలోమీటర్ల మేర రూ;3.39 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. మరియు మామిడిపాలెం ఆర్&బి కూడలి నుండి మామిడిపాలెం గ్రామానికి మంజూరు అయిన 3.8 కిలోమీటర్ల మేర రూ;2.32 కోట్ల వ్యయంతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణం కోసం భూమిపూజ చేశారు. పై నిర్మాణ పనుల రీత్యా సంప్రదాయ బద్దంగా కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా భూమిపూజ కార్యక్రమాలను కూటమి శ్రేణులతో కలసి ఘనంగా నిర్వహించారు. మొత్తంగా రూ;11.62 కోట్ల రూపాయల వ్యయంతో పీఎం- జన్ మన్ నిధులు ద్వారా పి ఐ యు శాఖ ద్వారా బీటీ రహదారుల నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నట్లు పేర్కొన్నారు. మండలంలో గత ప్రభుత్వ హయాంలో పాలకుల అండదండలతో గుత్తేదారులు అనేక రహదారుల నిర్మాణాలు అసంపూర్తిగా ప్రమాద నిలయాలుగా తయారు చేసినట్లు ఎద్దేవ చేశారు. నిధులు డ్రా చేసుకుని ఆయా నిర్మాణ పనులు చేయకుండా కాలయాపన చేస్తున్నట్లు తెలిపారు. కానీ కూటమి అధికారంలోకి వచ్చాక పోలవరం జిల్లాలో మంజూరు అయిన ప్రతీ అభివృద్ధి పనులను పూర్తి పారదర్శకంగా పూర్తి చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక సార్లు ప్రస్తుతం చేపట్టబోయే రహదారుల కోసం దశాబ్దాలుగా వారు పడుతున్న ఇబ్బందులు గుర్తించి వాటి మంజూరుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వాటి మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. నాణ్యతలో రాజీ పడితే చర్యలు తప్పవు బీటీ రహదారుల నిర్మాణాల్లో గుత్తేదారులు ఎలాంటి రాజీ లేకుండా నిర్మాణ పనులు పూర్తి చేయాలని రాష్ట్ర ఎస్టీ సంక్షేమ కమిటి చైర్ పర్సన్, ఎమ్మెల్యే మిరియాల శిరీషాదేవి ఆదేశించారు. మండలంలో పి ఐ యు శాఖ ద్వారా నిర్మించే బీటీ రోడ్లు భూమిపూజ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఆయా నిర్మాణ పనులను గుత్తేదారులు సకాలంలో పూర్తి నాణ్యతతో చేయాలని సూచించారు. పర్యవేక్షణ చేపట్టాల్సిన పి ఐ యు శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పూర్తి పర్యవేక్షణతో పనులు చేపట్టాలని సూచించారు. ఆయా పనులు ఏయే దశల్లో ఎంత మేరకు నిర్మాణ పనులు చేయాలో ఎంత మేరకు నిధులు విడుదల చేయాలో అలాగే చేయాలని ఆదేశించారు. సకాలంలో పనులు పూర్తి నాణ్యతతో చేయాలని సూచించారు. ఆయా నిర్మాణ పనులను స్థానిక కూటమి శ్రేణులు దగ్గరుండి పూర్తి నాణ్యతతో చేయించుకోవాలని సూచించారు. ప్రస్తుతం భూమిపూజ చేసిన రహదారుల నిర్మాణాల కోసం ఆయా గ్రామాల ప్రజలు దశాబ్దాల నుండి వేచి చూస్తున్నారని అన్నారు. ఈ సందర్భం గా ఆమె మారుమూల గ్రామాలైన వాటికి బీటీ రోడ్లు మంజూరులో చేసిన కృషికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికీ మా గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక పడుతున్న ఇబ్బందులు గుర్తించి కష్టాలు తీరుస్తున్న ఆమెకు అందులోనూ రూ ;11.62 కోట్ల నిధులు అడ్డతీగల మండలానికి కేటాయించడం తో ఆదివాసీలు తమదైన సంప్రదాయం ప్రకారం కృతజ్ఞతలు తెలిపారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు జర్తా వెంకట రమణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఈరోజు స్వప్న కుమారి, ఏఎంసి డైరెక్టర్ బలువు సత్యవతి, క్లస్టర్ ఇంచార్జీ గుంజిగెడ్డ గంగరాజు అనే యేసు, కో క్లస్టర్ బెలెం సత్య నారా యణ, మండల పార్టీ నాయకులు వడ్డి రాంబాబు, మాజీ మండల పార్టీ అధ్యక్షులు వంకా సతీష్, ఎడ్ల శ్రీనివాస్ , మాజీ ఎంపీటీసీ పి.ఆదిలక్ష్మి., జారగెడ్డ మాణిక్యాల రావు, బీరా బాలయోగి, మద్దాల మధు సుధన్, పి ఐ యు శాఖ అధికారి ఆచారి, మండల రెవెన్యూ ఉప తహసీల్దార్ నేదూరి దొరకయ్య, ఎంపిడిఓ ప్రసాద్, ఎంఈఓ పి.శ్రీనివాస రావు, ఏపిఎం జారగెడ్డ ఆదినారాయణ, ఏపీవో చిరంజీవి, ఐసిడిఎస్ పర్యవేక్షకులు చెదల బాపనమ్మ , గృహ నిర్మాణ శాఖ ప్రతినిధి చంద్రమ్మ, మాజీ సర్పంచ్ అచ్చియమ్మ, బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు కురుసం రాజబాబు, జనసేన నాయకులు తాటికొండ రాజేంద్ర, డి.భీమవరం తెదేపా నాయకులు చెక్క అప్పారావు అనే అబ్బులు , చెక్క వెంకటరమణ, చెక్క వరలక్ష్మి, మాగంటి బాబురావు, శ్యామల రావు, ముర్ల సత్యవతి, మడకం పైడియ్య దొర, బఠాణి వరలక్ష్మి, సీనియర్ కార్యకర్త సత్తి సత్తిరెడ్డి, మండల తెలుగు యువత నాయకులు సాకేటి రాజా, మద్దేటి రమేష్ బాబు, బిత్తరి భూదేవి, గుంజిగెడ్డ చిన్నబాబు, పలు ప్రభుత్వ శాఖల అధికారులు అధిక సంఖ్యలో కూటమి పార్టీల కార్యకర్తలు అధిక సంఖ్యలో అభిమానులు తదితరులు పాల్గొన్నారు.